Pushpa 2 Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 : ది రూల్’ చిత్రంలో అభిమానులు జీవితాంతం గుర్తించుకోదగ్గ సన్నివేశాలను అందించాడు డైరెక్టర్ సుకుమార్. ముఖ్యంగా అల్లు అర్జున్ లోని నట విశ్వరూపాన్ని ఆయన బయటకి లాగాడు. మళ్ళీ అల్లు అర్జున్ ఈ రేంజ్ లో నటించలేడేమో అనే విధంగా ఆయన్ని వాడుకున్నాడు డైరెక్టర్ సుకుమార్. ముఖ్యంగా ‘గంగమ్మ జాతర’ ఎపిసోడ్ ఈ సినిమాకి ఆయువుపట్టుగా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే. కేవలం ఈ సన్నివేశాన్ని చూసేందుకు అభిమానులు, ప్రేక్షకులు థియేటర్స్ కి రిపీట్ గా వెళ్లి చూడొచ్చు. అలాంటి అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని అందించింది ఈ సన్నివేశం. 20 నిమిషాల పాటు సాగే ఈ సన్నివేశంలో అల్లు అర్జున్ నట విశ్వరూపం, నాట్య విశ్వరూపాన్ని చూసి ఆడియన్స్ కి థియేటర్స్ లో రోమాలు నిక్కపొడుచుకున్నాయి. థియేటర్ నుండి బయటకి వచ్చిన తర్వాత కూడా ఈ సన్నివేశంలో అల్లు అర్జున్ నటన మనల్ని వెంటాడుతుంది.
నిజంగా అమ్మవారు అల్లు అర్జున్ లోకి వచ్చి వెళ్లాడా అనే అనుభూతి మనలో కలుగుతుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భాషతో సంబంధం లేకుండా ఈ స్థాయిలో చెలరేగిపోవడానికి కారణం ఈ సన్నివేశమే అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమా ప్రదర్శితమవుతున్న ఒక థియేటర్ లో, మహిళ లీనమై ఈ సన్నివేశాన్ని చూస్తున్న సమయంలో, ఆమెకి అమ్మవారు పూనింది. దీంతో ఆమె పక్క సీట్ లో కూర్చున్నవారు, ఆమెని శాంతిపచేయడానికి చాలా ప్రయత్నాలు చేసారు. దీనికి సంబంధించిన వీడియో ని సోషల్ మీడియా లో పుష్ప మూవీ టీం షేర్ చేయగా, అది బాగా వైరల్ అయ్యింది. అయితే ఆ మహిళకు నిజంగా అమ్మవారు పూనిందా?, లేకపోతే పబ్లిసిటీ కోసం ఆమె అలా నటించిందా? అనేది తెలియాల్సి ఉంది. అయితే నిజంగానే ఆమెకి అమ్మవారు పూని ఉండొచ్చని కొంతమంది అభిప్రాయ పడుతున్నారు.
ఎందుకంటే ఈ సన్నివేశాన్ని చూసిన ప్రతీ ఒక్కరికి వాళ్లకు తెలియకుండానే చొక్కాలు చింపుకొని ఈలలు వేస్తూ చిందులేసిన సందర్భాలు ఉన్నాయి. అలా చిందులు వేయడానికి అల్లు అర్జున్ అభిమాని అవ్వక్కర్లేదు. ఏ మనిషికి అయినా ఊపు వచ్చేస్తుంది. మరీ లీనమై చూసే వారికి అమ్మవారు సోకే అవకాశాలు కూడా ఉన్నాయి. అల్లు అర్జున్ అద్భుతమైన నటన, దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఆడియన్స్ ని ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్ళిపోయింది. ‘కాంతారా’ చిత్రాన్ని మరో లెవెల్ కి తీసుకెళ్లడానికి క్లైమాక్స్ సన్నివేశం ఎలా అయితే ఉపయోగపడిందో, ‘పుష్ప 2’ చిత్రంలో ఈ ‘గంగమ్మ జాతర’ ఎపిసోడ్ అలా ఉపయోగపడింది. తెలుగులో ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబడుతుంది?, బాక్స్ ఆఫీస్ రేంజ్ ఏమిటి అనేది ఇప్పుడే చెప్పలేము కానీ, బాలీవుడ్ లో మాత్రం ఈ సినిమా సృష్టించే అద్భుతాల గురించి కొనేళ్లు మాట్లాడుకుంటారు, ఆ రేంజ్ లో ట్రెండ్ నడుస్తుంది. చూడాలి మరి ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.
Gango Renuka Thalli #Pushpa2TheRule pic.twitter.com/p2nH6EMTsb
— Pushpa (@PushpaMovie) December 7, 2024