Chandrababu: చంద్రబాబు.. ఇండియన్ మోస్ట్ సీనియర్ పొలిటీషియన్. ప్రధాని మోదీ కంటే సీనియర్. 1978లోనే ఎమ్మెల్యే అయ్యారు. మంత్రిగా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు. తరువాత టిడిపిలో చేరారు. 1989 నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. సుదీర్ఘకాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా రికార్డు సృష్టించారు. తాజా ఎన్నికల్లో గెలిచిన వారిలో సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే కూడా ఆయనే. ఇలా ఎలా తీసుకున్నా చంద్రబాబు రికార్డును దరిదాపుల్లో బద్దలు కొట్టే వారు లేరు.అయితే అది అసాధ్యం కూడా. అంతలా రాజకీయ పరిస్థితులు మారిపోయాయి.
ఈ రాష్ట్రానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టింది కూడా ఆయనే. గుమ్మడి రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాల పాటు సీఎం గా ఉన్నారు. 1994లో టిడిపి అధికారంలోకి వచ్చింది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. అక్కడకు ఏడాది తరువాత టిడిపిలో సంక్షోభం ఎదురైంది. చంద్రబాబు పార్టీని, ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్నారు. 1999 ఎన్నికల్లో సైతం చంద్రబాబు గెలిచారు. 2004 వరకు 9 ఏళ్ల పాటు సుదీర్ఘకాలంగా ఉమ్మడి ఏపీని పాలించారు. అక్కడి నుంచి రెండు ఎన్నికల్లో ఓటమి ఎదురైంది. ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కింది. 2014లో నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు చంద్రబాబు. ఐదేళ్లపాటు ఏపీని పాలించారు. 2019లో ఓటమి ఎదురు కావడంతో ప్రతిపక్షానికి పరిమితం అయ్యారు. అప్పటినుంచి ఐదేళ్లపాటు ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేయనున్నారు.
చంద్రబాబు తన రాజకీయ ప్రస్థానంలో 14 సంవత్సరాలు పాటు సీఎంగా పనిచేశారు. 15 సంవత్సరాల పాటు ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఏపీలో ఒక రికార్డును సొంతం చేసుకున్నారు. మరోవైపు ఈసారి ఎన్నికల్లో శాసనసభలో అడుగుపెట్టిన 175 మందిలో.. చంద్రబాబు సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే. 1978లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు చంద్రబాబు. 1983లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి టిడిపి అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అనంతరం టిడిపిలో చేరారు. 1985 ఎన్నికల్లో పోటీ చేయలేదు. 1989 నుంచి కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేసి వరుసగా గెలుస్తూ వచ్చారు. ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నేతగా, పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా చంద్రబాబుది ఒక అరుదైన రికార్డ్. దానిని అధిగమించాలంటే చాలా కష్టం. ఒక ప్రాంతీయ పార్టీ సుదీర్ఘకాలం మనగలగడం ఒక్క టిడిపినే చూస్తున్నాం. మొన్నటికి మొన్న తెలంగాణలో కెసిఆర్ కు ఎదురైన ఓటమితో ఆయన పార్టీ ఏ స్థితిలో ఉందో ఒకసారి తెలుసుకుంటే అర్థమవుతుంది. అటువంటిది తెలుగుదేశం పార్టీ దారుణ ఓటమి చూసినా.. అదే స్థాయిలో విజయం అందుకోవడం చంద్రబాబు తోనే సాధ్యమైంది. అందుకే ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో చంద్రబాబుది ఒక ప్రత్యేక స్థానం అని చెప్పవచ్చు.