https://oktelugu.com/

CM Chandrababu: జగన్ ను ఫాలో అవుతున్న చంద్రబాబు.. ఇన్ సైడర్ ట్రేడింగ్ తో ఆ నేతలకు ఉచ్చు

రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఎకరాల అసైన్డ్ భూమి చేతులు మారిపోయింది. నిషేధిత జాబితా నుంచి ఆ భూములను తొలగించి.. ఎంచక్కా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఇప్పుడు వాటిపైనే దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం.

Written By: Dharma, Updated On : November 18, 2024 1:21 pm
CM Chandrababu

CM Chandrababu

Follow us on

CM Chandrababu: ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. వైసీపీని లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రాజకీయంగా జగన్ ను దెబ్బ కొట్టాలని అడుగులు వేస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదవుతున్నాయి. అదే స్థాయిలో సైతం అరెస్టులు ప్రారంభం అయ్యాయి. మరోవైపు వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్ణయాలపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. ముఖ్యంగా భూ లావాదేవీలపై ఫోకస్ పెట్టింది. పూర్తిస్థాయి ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నం అయ్యింది. వైసిపి ప్రభుత్వ హయాంలో భారీగా అవినీతి జరిగిందని టిడిపి తో పాటు జనసేన ఆరోపణ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అసెంబ్లీ వేదికగా వాటిపై విచారణకు ఆదేశించనుంది. జగన్ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా భూ అక్రమాలు జరిగినట్లు కూటమినేతల ఆరోపిస్తున్నారు.దీనికి సంబంధించి తాజాగా మంత్రి అనగాని సత్యప్రసాద్ అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు. ఏపీ అసెంబ్లీ అసైన్డ్ భూముల వ్యవహారంపైచర్చ జరిగింది. అప్పుడే మంత్రి స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 25 వేల ఎకరాల అసైన్డ్ భూములు గత ప్రభుత్వ హయాంలో చేతులు మారాయని చెప్పుకొచ్చారు. రిజిస్ట్రేషన్లు జరిగాయని వెల్లడించారు.

* పట్టు బిగించిన కూటమి
కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని జిల్లాల్లో అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పరిశీలన ప్రారంభించింది. ప్రతి జిల్లాలో భారీ ఎత్తున అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ జరిగినట్లు వెల్లడయ్యింది. ప్రధానంగా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు కూటమి ప్రభుత్వం స్పష్టమైన ఆధారాలతో సహా నిర్ధారణకు వచ్చింది. అందుకే ఈ భూ దందాను బయట పెట్టేందుకు సిద్ధపడుతోంది. ఇప్పటికే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తేవడానికి అన్ని విధాల సిద్ధంగా ఉంది కూటమి ప్రభుత్వం. ఈ యాక్ట్ కానీ అమల్లోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా జరిగిన భూ దోపిడీ బయటపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

* అప్పట్లో అమరావతి పై అవే ఆరోపణలు
జగన్ హయాంలో అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించిన సంగతి తెలిసిందే అప్పట్లో పెద్ద దుమారమే నడిచింది. దీనిపై సిఐడి విచారణ కూడా కొనసాగింది. కొంతమంది మాజీ మంత్రులపై కూడా కేసులు నమోదయ్యాయి. కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ వెనుక ఉన్న వైసీపీ నేతలు చుట్టూ ఉచ్చు బిగిస్తోంది కూటమి ప్రభుత్వం. దీంతో భూ దందా నడిపిన నేతల్లో ఒక రకమైన ఆందోళన ప్రారంభం అయింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.