Pushpa 2 Trailer: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పుష్ప 2 : ది రూల్’ థియేట్రికల్ ట్రైలర్ ని నిన్న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ కి అన్ని బాషల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వ్యూస్ విషయం లో ఆల్ టైం రికార్డుని నెలకొల్పి ముందుకు దూసుకుపోతున్న ఈ ట్రైలర్, సినిమా మీద ఇప్పటి వరకు ఉన్న అంచనాలను పదింతలు పెంచేలా చేసింది. అయితే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని నిన్న సాయంత్రం పాట్నా లో గ్రాండ్ గా నిర్వహించిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంత భారీ జనంతో ఒక ఈవెంట్ ని ఇటీవల కాలం లో జరపలేదు. పాట్నా లో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి దాదాపుగా లక్ష మంది అభిమానులు హాజరు అయ్యారంటే, నార్త్ ఇండియా లో అల్లు అర్జున్ క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. మొదటి నుండి నార్త్ ఆడియన్స్ లో అల్లు అర్జున్ కి మంచి క్రేజ్ ఉంది, పుష్ప చిత్రంతో ఆ క్రేజ్ ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకుంది.
ఇదంతా పక్కన పెడితే అక్కడికి వచ్చిన పోలీసులకు అభిమానులను కంట్రోల్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. తోపులాటలో జరగకూడని అనర్థాలు జరిగే అవకాశం ఉండడంతో, పోలీసులు లాఠీ ఛార్జి చేసారు. దీంతో కొంత మంది అభిమానులు పోలీసులపై చెప్పుల వర్షం కురిపించారు. దీనికి ఆగ్రహించిన పోలీసులు అభిమానులపై మరింత తీవ్రంగా లాఠీ చార్జి చెయ్యాల్సి వచ్చింది. ఈ పరిణామాల కారణంగా కాసేపు సభ ప్రాంగణం మొత్తం గందరగోళంగా మారింది. అంతే కాదు ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి బీహార్ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ విజయ్ కుమార్ సింహా ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఆయనతో పాటు ప్రభుత్వానికి చెందిన కొంతమంది పెద్దలు ముఖ్య అతిథులుగా హాజరు కాగా, ఒక ప్రభుత్వ అధికారి అల్లు అర్జున్ తో సెల్ఫీ దిగేందుకు చాలా ప్రయత్నం చేసారు. కానీ అల్లు అర్జున్ వ్యక్తిగత సిబ్బంది అతన్ని నిలువరించడం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ఇలా ఎన్నో సంఘటనలు ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో జరిగాయి. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఈ రేంజ్ లో జరిగితే, ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏ రేంజ్ లో ఉండబోతుందో మీ ఊహలకే వదిలేస్తున్నాం. నార్త్ ఇండియాలో మరో నాలుగు ప్రాంతాల్లో ఇలాంటి గ్రాండ్ ఈవెంట్స్ నిర్వహించడానికి సిద్దం అవుతుంది మూవీ టీం. వీటి తర్వాత సినిమా హైప్ వేరే లెవెల్ కి చేరుకోవచ్చు. అదే విధమైన హైప్ ట్రెండ్ కొనసాగుతూ ముందుకు పోతే బాలీవుడ్ లో ఈ చిత్రం మొదటి రోజే 80 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంటుందట. చూడాలి మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ ప్రకంపనలు సృష్టించబోతోంది అనేది.