Payyavula Keshav (1)
Payyavula Keshav: ఏపీ సర్కార్ కు( Andhra Pradesh government) అప్పులు తప్పేలా లేవు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న రుణం తప్పనిసరిగా మారింది. గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేసింది. ఆ సమయంలో పరిమితికి మించి అప్పులు చేసింది. దానిపై విమర్శలు చేశాయి కూటమి పార్టీలు. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అప్పులు తప్పడం లేదు. గత ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చడానికి ఆదాయం సరిపోతోందని.. అప్పులు చేయక అనివార్య పరిస్థితి ఎదురైందని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నారు. వార్షిక రుణ పరిమితిని పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
Also Read: పీఎం ఇంటర్న్‌షిప్‌కు మొబైల్ యాప్..నిరుద్యోగులకు నెలకు 6వేలు
* తగ్గిన ఆదాయం
2014లో అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం( Telugu Desam) ప్రభుత్వం. రాష్ట్ర విభజనతో నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడింది. దీంతో ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది. ప్రధాన ఆదాయ వనరుగా నిలిచే హైదరాబాద్ తెలంగాణలో ఉండిపోయింది. దీంతో ఏపీలో ఆదాయం అంతంత మాత్రమే ఉండగా కేంద్ర ప్రభుత్వ రుణాలపై ఆధారపడాల్సి వచ్చింది. అయితే రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా అప్పట్లో కొంత మొత్తం కేటాయింపులు చేస్తూ వచ్చింది కేంద్రం. విభజనతో ఇబ్బందిపడిన ఏపీకి కొంతవరకు ఉపశమనం దక్కుతూ వచ్చింది. కానీ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా సీన్ మారిపోయింది.
* పథకాల కోసం రుణాలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress party ) సంక్షేమ పథకాలకు అత్యంత ప్రాధాన్యమిచ్చింది. అభివృద్ధి కంటే సంక్షేమ పథకాలను తేదీలవారీగా అమలు చేసింది. ఇందుకు భారీగా బడ్జెట్ కేటాయింపులు చేసింది. భారీగా నిధులు ఖర్చు చేసింది. అన్ని రకాల నిధులను దారిమల్లించి సంక్షేమ పథకాలకు ఖర్చు చేయడంతో రుణాలు అమాంతం పెరిగాయి. అయితే అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రుణ ప్రయత్నాలను ఎద్దేవా చేసింది కూటమి పార్టీలు. అప్పట్లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రతినెలా ఢిల్లీలో పడిగాపులు కాసేవారు. రుణ ప్రయత్నాలు చేసేవారు. దానిని అప్పట్లో తప్పుపట్టాయి కూటమి పార్టీలు. కానీ ఇప్పుడు కూటమి హయాంలో సైతం రుణాల కోసం పడిగాపులు ఢిల్లీలో కావాల్సి వస్తోంది.
* కొత్త అప్పుల కోసం..
కొత్తగా రాష్ట్రానికి 68 వేల కోట్ల అప్పులకు అనుమతుల కోసం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్( Finance Minister paiyavula Keshav ) ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక ఏడాదికి కేంద్ర ప్రభుత్వం అనుమతించిన 71 వేల కోట్ల రుణాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు అప్పుల పరిమితికి మించి ఇంకా తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ఆర్థిక శాఖ మంత్రి నిరీక్షిస్తున్నారు. చంద్రబాబు సర్కార్ కొత్త అప్పుల కోసం ఆర్బిఐ కళ్ళకు గంతలు కట్టినట్లు వైసిపి ఆరోపిస్తోంది. మొత్తానికైతే ఎవరు అధికారంలో ఉన్న.. అప్పులు అనివార్యంగా మారినట్లు అయ్యింది.