Rana Daggubati , Vijay Deverakonda
Rana Daggubati and Vijay Deverakonda : సెలబ్రిటీలను దైవంశ సంభూతులుగా భావించే సమాజం మనది. ఇక సెలబ్రిటీలు కూడా తామేదో దేవుళ్ళ పిల్లలమని.. ఆకాశం నుంచి ఊడిపడ్డామని.. సుప్రీంశక్తులను కలిగి ఉన్నామనే భ్రమలో ఉంటారు. ఇక పాలక ప్రభుత్వాల గురించి తెలిసింది కదా.. సెలబ్రిటీలకు అనుకూలంగాన వ్యవహరిస్తుంటారు. అప్పుడప్పుడు ఏవైనా కేసులు వెలుగులోకి వచ్చినప్పుడు.. వారిని కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అప్పటిదాకా గొంతు చించుకొని అరిచి.. ఆ తర్వాత సైలెంట్ అయిపోతుంది. ఇక ప్రస్తుతం తెలంగాణలో బెట్టింగ్ యాప్ లపై ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. బెట్టింగ్ యాప్ లకు ప్రమోషన్లు చేసిన సెలబ్రిటీల వెంట వదలా బొమ్మాళి అంటూ పడుతోంది. ఇప్పటికే విష్ణు ప్రియ, అనన్య నాగళ్ళ, రీతు చౌదరి, నిధి అగర్వాల్, శోభా శెట్టి, నయని పావని, అమృత చౌదరి, యాంకర్ శ్యామల, ఇమ్రాన్, టేస్టీ తేజ, వాసంతి కృష్ణన్, నేహా పటాన్, వర్షిణి, పద్మావతి, సిరి హనుమంతు, హర్ష సాయి, సన్నీ యాదవ్, సుప్రీత.. మొత్తం 25 మందిపై తెలంగాణ పోలీసులు కేసులు బుక్ చేశారు. వీరిలో బిగ్ బాస్ అనే కార్యక్రమాల ద్వారా ఫేమస్ అయిన వారే చాలా ఎక్కువమంది. అయితే ఇప్పుడు ఈ జాబితాలో రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ లాంటి వారు ఉండటమే ఆశ్చర్యకరం.
Also Read : రానా దగ్గుబాటి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా అదేనా..? బాహుబలి వల్ల కెరీర్ నాశనం అయిందిగా!
ఇదేం దరిద్రం..
దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత వంటి పెద్దపెద్ద స్టార్ లపై తెలంగాణ పోలీసులు కేసులు బుక్ చేశారు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలంటే.. దగ్గుబాటి రానాకు కావలసిన దానికంటే ఎక్కువ డబ్బుంది.. అయినప్పటికీ అతడు కక్కుర్తి పడ్డాడు. విజయ్ దేవరకొండకు విపరీతమైన డిమాండ్ ఉంది. అయినా తన చిల్లర బుద్ధిని పోనిచ్చుకోలేదు. ఇక మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె కూడా బెట్టింగ్ యాప్ లకు ప్రమోషన్ చేసింది. ఇక ప్రకాష్ రాజ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పైకేమో గొప్ప గొప్ప నీతులు చెబుతుంటాడు. చివరికి ఏమో బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేస్తుంటాడు.. ప్రణీత కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి తన బరువు తీసుకుంది.. ఇక కేసులు నమోదైన వారిలో శ్రీముఖి కూడా ఉండడం నిజంగా ఆశ్చర్యకరం.. తెలంగాణ పోలీసులు వీరందరిపై కేసులు నమోదు చేసి తమ సత్తా ఏమిటో చూపించారు. అక్కడ దాకా ఎందుకు మొన్నామధ్య అల్లు అర్జున్ ను జైలుకు పంపించి తెలంగాణ పోలీసులు తమ పవర్ ఏమిటో చూపించారు.. అయితే ఇక్కడ బెట్టింగ్ యాప్ లకు ప్రమోషన్ చేస్తున్న సెలబ్రిటీలపై కేసును నమోదు చేసిన పోలీసులు.. వాటిని ఎక్కడ దాకా తీసుకెళ్తారనే విషయాన్ని పక్కన పెడితే.. అకున్ సబర్వాల్ మాదిరిగా పిచ్చి కేసులు పెట్టి.. రోజువారీ షో లు చేయకుండా.. ఇలాంటి చిల్లర పనులకు పాల్పడుతున్న సెలబ్రిటీలపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ సమాజం కోరుతోంది.
Also Read : ఘనంగా ప్రారంభమైన రానా దగ్గుబాటి ఫుడ్ స్టోర్..కేజీ టమాటా ధర ఇన్ని వేల రూపాయిలా..? ఇదేమి దోపిడీ సామీ!