BCCI
BCCI : ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ద్వారా టీమ్ ఇండియా వన్డే ర్యాంకింగ్స్ లో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలో అన్ని రంగాలలో అధిపత్యాన్ని ప్రదర్శించింది. ఫలితంగా ప్రత్యర్థులను ఓటమి పాలు చేసింది. ఒక్క ఓటమి కూడా లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుని టీమ్ ఇండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. 2024 లో జరిగిన టి20 వరల్డ్ కప్ లోనూ టీమిండియా ఆద్వితీయమైన ప్రదర్శన చేసింది. ఒక్క ఓటమి కూడా లేకుండా టి20 వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది. టీమిండియా ఛాంపియన్ ట్రోఫీని గెలిచిన నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆటగాళ్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఏకంగా భారీ క్యాష్ ప్రైస్ ప్రకటించింది. ఆటగాళ్లకు ₹58 కోట్లను నగదు బహుమతిగా అందిస్తామని వెల్లడించింది. గురువారం సామాజిక మాధ్యమాల వేదికగా బీసీసీఐ ఈ ప్రకటన విడుదల చేసింది. నగదు బహుమతిని ఆటగాళ్లకు, కోచ్ లకు, సహాయక సిబ్బందికి, సెలక్షన్ కమిటీకి ఇస్తామని బీసీసీఐ వెల్లడించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా సాధించిన ప్రదర్శనకు గుర్తింపుగా ఈ నజరానా ప్రకటించినట్టు బీసీసీఐ వెల్లడించింది.
Also Read : బిసిసిఐ కీలక నిర్ణయం.. ఆ కాంట్రాక్టులు కోల్పోతున్న రోహిత్, విరాట్, జడేజా..
అప్పట్లోనే భావించినప్పటికీ..
టీమిండియా చాంపియన్ ట్రోఫీ గెలిచిన తరుణంలో బీసీసీఐ క్యాష్ ప్రైజ్ ప్రకటిస్తుందని అందరూ అనుకున్నారు. కాకపోతే దీనికి బీసీసీఐ 11 రోజుల వరకు సమయం తీసుకుంది. అయితే ప్రకటించిన క్యాష్ ప్రైజ్ లో ఎవరి వాటా ఎంత అనేది బీసీసీఐ వెల్లడించలేదు. ఇక చాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ ఆధ్వర్యంలో టీమిండియా అనితర సాధ్యమైన విజయాలను సొంతం చేసుకుంది. బలమైన పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ (రెండుసార్లు) ను ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీని దక్కించుకుంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లను లీగ్ దశలో టీమిండియా ఓడించింది. సెమీఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. సాగిన ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టును నాలుగు వికెట్ల తేడాతో టీమ్ ఇండియా ఓడించి విజేతగా నిలిచింది.. టీమిండియా ఓవరాల్ గా మూడు ఛాంపియన్స్ ట్రోఫీలను గెలుచుకుంది. 2013, 2025లో ఛాంపియన్స్ ట్రోఫీలను టీమ్ ఇండియా దక్కించుకుంది. గతంలో శ్రీలంక జట్టుతో కలిసి సంయుక్త విజేతగా నిలిచింది. ఇక 2024లో టీమ్ ఇండియా టి20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు బీసీసీఐ ₹125 కోట్ల రూపాయల భారీ క్యాష్ ప్రైజ్ ను ప్రకటించింది. అప్పట్లో ఈ ప్రైజ్ మనీని హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ , ఇతర ఆటగాళ్లకు బీసీసీఐ ఐదు కోట్ల చొప్పున పంచింది. మిగతా వారికి ₹2.5 కోట్ల చొప్పున.. సహాయక సిబ్బందికి రెండు కోట్ల చొప్పున ఇచ్చింది. అజిత్ అగార్కర్ ఆధ్వర్యంలోని సెలక్షన్ కమిటీ.. రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంపికైన రింకు సింగ్, గిల్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్ కు తలా ఒక కోటి ఇచ్చింది. అయితే సహాయక సిబ్బందితో తనకు కూడా ₹2.5 కోట్లు మాత్రమే ఇవ్వాలని రాహుల్ ద్రావిడ్ కోరడంతో.. ఆ విధంగానే బీసీసీఐ పెద్దలు చేసినట్టు అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇక తాజాగా బీసీసీఐ ప్రకటించిన ₹58 కోట్ల ప్రైజ్ మనీలో ఎవరి వాటా ఎంత అనేది తేలాల్సి ఉంది.
Also Read : నో ఫ్యామిలీ.. ఎవరికీ మినహాయింపు లేదు.. చాంపియన్స్ ట్రోఫీ నుంచి బీసీసీఐ “టాప్ టెన్ కమాండ్మెంట్స్”