spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu: నమ్మి వచ్చిన ఆ వైసిపి ఎమ్మెల్యే లను నిండా ముంచిన చంద్రబాబు

Chandrababu: నమ్మి వచ్చిన ఆ వైసిపి ఎమ్మెల్యే లను నిండా ముంచిన చంద్రబాబు

Chandrababu: తెలుగుదేశం పార్టీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు షాక్ ఇచ్చారు. టికెట్లకు నో చెప్పారు. వైసిపి నాయకత్వంతో విభేదించి..ఆనం నారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవెల్లి శ్రీదేవి టిడిపి వైపు వచ్చిన సంగతి తెలిసిందే. వీరంతా వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కుతుందని ఆశపడ్డారు. కానీ వారి ఆశలను చంద్రబాబు అడియాశలు చేశారు. కేవలం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి మాత్రమే తొలి జాబితాలో చోటు దక్కింది. ఇందులో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవెల్లి శ్రీదేవిల నియోజకవర్గాల్లో వేరే వ్యక్తులకు టిక్కెట్లు కేటాయించారు. ఆనం రామనారాయణ రెడ్డిని మాత్రం గాల్లో ఉంచారు.దీంతో వారు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ సోషల్ మీడియాలో ఈ నేతలపై రకరకాలప్రచారం జరుగుతోంది.

గత ఏడాది మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేశారన్న ఆరోపణతో ఈ నలుగురు వైసీపీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. అప్పటినుంచి టిడిపి ఎమ్మెల్యేలు గానే కొనసాగుతున్నారు.వచ్చే ఎన్నికల్లో ఈ నలుగురికి టికెట్లు ఖాయమని ప్రచారం జరిగింది. ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించారు. ఇప్పుడు ఆయననే అభ్యర్థిగా ప్రకటించారు. తాడికొండకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండవల్లి శ్రీదేవికి టికెట్ కేటాయించలేదు. ఆమె స్థానంలో శ్రవణ్ కుమార్ కు అభ్యర్థిగా ప్రకటించారు. ఉదయగిరిలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కాకుండా కాకర్ల సురేష్ కు ఎంపిక చేశారు. ఆనం రామనారాయణ రెడ్డి పేరు తొలి జాబితాలో లేదు. ఆయన రెండు మూడు నియోజకవర్గాలపై దృష్టి పెట్టడంతో.. ఏదో ఒక నియోజకవర్గం కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఉండవెల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలకు మాత్రం టికెట్ లేనట్టేనని టాక్ నడుస్తోంది. వైసీపీ నాయకత్వాన్ని విభేదించి టిడిపిలో చేరితే ఏంటి పరిస్థితి అని వారు నిట్టూరుస్తున్నట్లు తెలుస్తోంది.

జనసేన, బిజెపికి సీట్లు సర్దుబాటు చేయాల్సి రావడంతో ఎక్కడికక్కడే సీనియర్లకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. కొందరు సీనియర్లు లోలోపల రగిలిపోతున్నారు. జూనియర్ల పేర్లతో జాబితాను ప్రకటించడంపై వారు ఆగ్రహంగా ఉన్నారు. అయితే మలి జాబితాలో ఎక్కడో ఒకచోట సర్దుబాటు చేస్తారని టాక్ నడుస్తోంది. అయితే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేల విషయంలో మాత్రం చంద్రబాబు ఆచితూచి నిర్ణయం తీసుకోవడం కనిపిస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు టికెట్ దక్కకపోవడంతో వైసీపీ సోషల్ మీడియా దుష్ప్రచారానికి దిగింది. చేసిన పాపానికి ఫలితం అనుభవించండి అంటూ కామెంట్స్ పెడుతూ వైసిపి శ్రేణులు పోస్టులను వైరల్ చేస్తున్నాయి. జగన్ మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే.. మీరు చేసింది ఏమిటి అని నిలదీసినంత పని చేస్తున్నారు.ముఖ్యంగా ఉండవల్లి శ్రీదేవి టికెట్ పై నమ్మకం పెట్టుకున్నారు.అమరావతికి మద్దతుగా ఆ మధ్యన జరిగిన సభలో ఏకంగా చంద్రబాబును, లోకేష్ ను ఆకాశానికి ఎత్తేశారు. నిత్యం చంద్రబాబు స్మరణ చేశారు. అయినా సరే ఆమెకు టికెట్ లభించలేదు. అయితే టికెట్ దక్కలేదనే బాధ కంటే.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఎక్కువగా వారు బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

YSRCP: మారిన గిరిజనుల మనసు.. వైసీపీకి డేంజర్ బెల్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయం కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పార్టీ పుంజుకోకపోవడం పై ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా గిరిజనులు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పతనమై.....

Perni Nani: పేర్ని వారి నకిలీ పట్టాలు.. ఈ కథ మామూలుగా లేదు

Perni Nani: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వింత వైఖరి వెలుగు చూస్తోంది. చాలామంది నేతలకు పోలీస్ కేసులు చుట్టుముడుతున్నాయి. అయితే అవన్నీ తమ వారసుల ద్వారా.. వారసుల కోసం చేసే...

Jagan Mohan Reddy: జగన్ వైఖరిపై ఆ ఫ్యామిలీ తీవ్ర అసంతృప్తి!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. వారంతా వైయస్ రాజశేఖర్ రెడ్డి కి సమకాలీకులు. కాంగ్రెస్ పార్టీ పతనం కావడంతో మరో ప్రత్యామ్నాయం లేక జగన్మోహన్ రెడ్డి...

YS Jagan Mohan Reddy: టిక్కెట్ లేదు.. పార్టీ కోసం పని చెయ్.. ఆ సీనియర్ కు తేల్చి...

YS Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంది. ఆ పార్టీ పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన...

Bhumana Karunakar Reddy : సీదిరి అప్పలరాజు, తమ్మినేని సీతారాం… నెక్స్ట్ భూమన?!

Bhumana Karunakar Reddy : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ల చుట్టూ ఇప్పుడు వివాదాలు, కేసులు, అరెస్టులు నడుస్తున్నాయి. వారి వ్యక్తిగత వ్యవహార శైలి, భూ కబ్జా ఆరోపణలు, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్...
Oktelugu Epaper
Exit mobile version