spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP CM Chandrababu: చంద్రబాబు ఓపికకు హాట్సాఫ్!

AP CM Chandrababu: చంద్రబాబు ఓపికకు హాట్సాఫ్!

AP CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) వయసుకు మించి కష్టపడుతున్నారు. ఒకవైపు రాష్ట్ర పాలన చూస్తూనే మరోవైపు జాతీయ స్థాయిలో సైతం నిత్య పర్యటనలు చేస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో వరుసగా భేటీలు జరుపుతున్నారు. నిత్య సమీక్షలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో సంప్రదింపులు జరుపుతున్నారు. ఎన్ డి ఏ సమావేశాలకు హాజరవుతున్నారు. బిజెపితో పాటు ఎన్డీఏ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రభుత్వాలు కొలువు తీరుతున్న సమయంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు హాజరవుతున్నారు. గత వారం రోజులుగా సీఎం చంద్రబాబు షెడ్యూల్ ను పరిశీలిస్తే.. క్షణం తీరిక లేకుండా గడుపుతున్న పరిస్థితి. ఈ వయసులో కూడా ఆయన కష్టపడుతున్న తీరు మాత్రం ఆకట్టుకుంటుంది.

* కోల్కత్తాలో ప్రత్యేక ఆకర్షణగా..
పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. 15 సంవత్సరాల మమతా పాలనను తెరదించుతూ కాషాయ జండా ఎగురవేసింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సువేందూ అధికారి ప్రమాణం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఎన్డీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు కు ప్రత్యేక ఆహ్వానం అందింది. దీంతో కార్యక్రమానికి హాజరైన చంద్రబాబుకు కేంద్ర పెద్దలు గౌరవభావంతో చూశారు. చాలా ప్రాధాన్యం ఇచ్చారు. బిజెపిలో కొనసాగుతున్న బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి చంద్రబాబుకు పాదాభివందనం చేశారు.

* ఢిల్లీ బాట..
పశ్చిమ బెంగాల్ సీఎం ప్రమాణ స్వీకారం నుంచి హైదరాబాద్ చేరుకున్నారు చంద్రబాబు. అదే సమయంలో హైదరాబాద్ వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. అక్కడ గంటపాటు గడిపారు మోడీ. అయితే ఆ పర్యటన ముగిసిన వెంటనే ఢిల్లీ బాట పట్టారు చంద్రబాబు. నిన్న రోజంతా కేంద్ర మంత్రులను కలిసి ఏపీలో కీలక ప్రాజెక్టుల కు సంబంధించిన అంశాలను చర్చించారు. సాయంత్రం ఉన్నత స్థాయి సదస్సులో సైతం పాల్గొన్నారు. ఢిల్లీలోనే రాత్రి బస చేశారు. ఈరోజు అస్సాం లో సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఇలా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు సీఎం చంద్రబాబు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ పాలనలో క్షణం తీరిక లేకుండా ఉంటూనే.. జాతీయస్థాయిలో సైతం అన్ని కార్యక్రమాలకు హాజరవుతున్నారు. నిజంగా చంద్రబాబు ఓపికకు హాట్సాఫ్ చెప్పాల్సిందే.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Oktelugu Epaper
Exit mobile version