Chandrababu Naidu : రాజకీయ జీవితంలో( political life) గెలుపు ఉంటుంది. ఓటమి ఉంటుంది. అయితే చాలా రకాల అవమానాలు కూడా ఉంటాయి. అయితే తెలుగు రాజకీయాల్లో మాత్రం ఎక్కువగా అవమానాలు ఎదుర్కొన్నారు చంద్రబాబు. అయితే ఎంతటి అవమానాలు ఎదురైనా సంయమనంతో ముందుకు సాగడం ఆయనకే సొంతం. అందుకే ఆయన పొలిటికల్ గా సక్సెస్ అయ్యారు. అయితే 2024 ఎన్నికల్లో గెలిచిన తరువాత చంద్రబాబులో స్పష్టమైన మార్పు వచ్చింది. ఆయనను వ్యతిరేకించినవారు సైతం దగ్గరయ్యారు. చంద్రబాబు పట్ల సానుకూలత చూపిస్తున్నారు. అయితే 75 ఏళ్ల చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ నేపథ్యంలో ఇది మంచి పరిణామమే. ముఖ్యంగా మెగా కుటుంబం చంద్రబాబు విషయంలో చూపుతున్న అభిమానం, గౌరవం ఆశ్చర్యం కలిగించక మానదు.
Also Read : భువనేశ్వరి కోసం.. ఓ చీరను సెలెక్ట్ చేసిన చంద్రబాబు!
* ప్రజారాజ్యం ఎంట్రీతో..
2004లో అధికారం కోల్పోయారు చంద్రబాబు( CM Chandrababu). ఉమ్మడి రాష్ట్రంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ప్రజల కష్టాలను తెలుసుకున్నారు. అయితే 1994 నుంచి 2004 వరకు టిడిపి ప్రభుత్వం వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంది. అయినా సరే 2009 ఎన్నికల నాటికి రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీని ఎదుర్కునేందుకు సర్వశక్తులు వడ్డింది. మహాకూటమి కట్టింది. అయితే ఆ సమయంలో చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ టిడిపికి అధికారాన్ని దూరం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 70 లక్షల ఓట్లను ఆ పార్టీ సొంతం చేసుకుంది. అది మొదలు మెగా కుటుంబంపై చంద్రబాబుతో పాటు టిడిపి శ్రేణులకు ఒక రకమైన కోపం ఉండేది. 2014 నుంచి ఆ పరిస్థితి మారింది. 2014లో రాష్ట్ర అవసరాల దృష్ట్యా పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన టిడిపికి మద్దతు ప్రకటించింది.
* వారిద్దరూ నెగిటివ్
అయితే టిడిపి విషయంలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan) సానుకూలంగా మారినా.. మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు మాత్రం నెగిటివ్ గానే ఉండేవారు. చిరంజీవి చంద్రబాబును వ్యతిరేకించిన సందర్భాలు లేవు కానీ.. చంద్రబాబు కంటే ఆయన రాజకీయ ప్రత్యర్థులతోనే చనువుగా మెలిగే వారు. ఇక నాగబాబు గురించి చెప్పనవసరం లేదు. చంద్రబాబుతో పాటు ఆయన బావమరిది నందమూరి బాలకృష్ణ పై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. ఒకానొక దశలో టిడిపి తో పొత్తు వద్దు అని వారిద్దరూ పవన్ కళ్యాణ్ కు సూచించినట్లుగా కూడా ప్రచారం నడిచింది. అయితే 2024 ఎన్నికలు వచ్చేసరికి పూర్తిగా సినిమా మారింది. చంద్రబాబు విషయంలో మెగా కుటుంబ వైఖరి మారింది.
* ఆకాశానికి ఎత్తేసిన నాగబాబు..
నిన్ననే సీఎం చంద్రబాబు( CM Chandrababu) జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మెగా బ్రదర్స్ విషెస్ ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా నాగబాబు చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు. చంద్రబాబు లేనిది రాష్ట్ర రాజకీయం లేదని ఆయన చేసిన ట్వీట్ ఆకర్షణీయంగా మారింది. రాష్ట్రంలో చంద్రబాబు ఎదుర్కొన్న అవమానాలు, కష్టాలు మరి రాజకీయ నాయకుడికి ఎదురు కాలేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు గారి పట్టుదల నన్ను ఆశ్చర్యపరిచిందని.. అసెంబ్లీలో ఆయనను అవమానిస్తున్నప్పటికీ ధైర్యంగా ఎదుర్కొన్నారని.. గౌరవంగా తిరిగి అడుగు పెట్టారని.. కానీ వాటన్నింటినీ తట్టుకొని నిలబడ్డారని కొనియాడారు నాగబాబు. చంద్రబాబు నిజమైన ఛాంపియన్, కాలం సవాళ్లను తట్టుకొని రాజనీతిజ్ఞుడిగా ఉన్నత స్థాయికి వెళ్లారని చెప్పుకొచ్చారు. ఇలా మెగా కుటుంబ అభిమానాన్ని తన వైపు తిప్పుకోవడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read : ముస్లింల హెచ్చరిక.. రేపు మహాధర్నా.. సంకటంలో చంద్రబాబు!