https://oktelugu.com/

Nandamuri Suhaasini: జూ.ఎన్టీఆర్ ను చావుదెబ్బ తీసే చంద్రబాబు ప్లాన్.. తెలంగాణ టీడీపీకి ఇది బూస్ట్.. మామూలుగా లేదుగా

నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని కి కీలక పదవి ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. రాజ్యసభకు పంపిస్తే ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నారు. తద్వారా జూనియర్ ఎన్టీఆర్ కు చెక్ చెప్పడంతో పాటు తెలంగాణలో టిడిపి బలోపేతానికి అవకాశం కలుగుతుందని భావిస్తున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : August 31, 2024 / 12:04 PM IST

    Nandamuri Suhaasini

    Follow us on

    Nandamuri Suhaasini: ఏపీలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీకి పెద్ద ఎత్తున నేతలు గుడ్ బై చెబుతున్నారు. ముఖ్యంగా రాజ్యసభ సభ్యులు పార్టీని వీడుతారని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు వైసీపీకి గుడ్ బై చెప్పారు. రాజ్యసభ పదవులకు సైతం రాజీనామా చేశారు.ఇంకా చాలామంది రాజ్యసభ సభ్యులు పార్టీకి గుడ్ బై చెబుతారని ప్రచారం జరుగుతోంది. అయితే చాలామంది ముందుకు వచ్చి ఖండిస్తున్నారు. తాము వైసీపీలోనే ఉంటామని చెబుతున్నారు. అయినా సరే ఒకరిద్దరూ పార్టీ మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే వైసీపీ నుంచి టిడిపిలోకి రాబోతున్న వారికి రాజ్యసభ సీట్లు ఇస్తారా? కొత్తవారికి అవకాశం ఇస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. చాలామందికి ఎమ్మెల్సీ తో పాటు నామినేటెడ్ పదవులు ఇస్తామని భరోసా ఇస్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజ్యసభ సభ్యులు రాజీనామా చేస్తే అవి తప్పకుండా టిడిపి కూటమి ఖాతాలో పడతాయి. వైసీపీకి వెళ్లే ఛాన్స్ లేదు. చంద్రబాబులో ధీమాకు అదే కారణం. అందుకే జగన్ సైతం.. అది పార్టీకి రాజీనామా చేసినట్టు కాదని.. నమ్మక ద్రోహంగా అభివర్ణిస్తున్నారు. అయినా సరే పార్టీలో ఎంతమంది ఉంటారో.. ఎంతమంది ఉండరో తెలియని పరిస్థితి.

    * ఆశావహులు అధికం
    అయితే రాజ్యసభ ఆశావహుల సంఖ్య అధికంగా ఉంది.ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో చాలామంది పదవులు ఆశిస్తున్నారు.మాజీ ఎంపీలు కంభంపాటి రామ్మోహన్ రావు, గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర, పనబాక లక్ష్మి, మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, టీడీ జనార్ధన్, వర్ల రామయ్య వంటి నేతలు ఆశిస్తున్నారు.మరోవైపు పార్టీ సీనియర్లు అశోక్ గజపతిరాజు,యనమల రామకృష్ణుడు సైతం ఉన్నారు. అయితే వారికి గవర్నర్ పోస్టులు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది.

    * మెగా బ్రదర్ కు ఛాన్స్
    మరోవైపు జనసేనకు ఒక రాజ్యసభ సీటు కేటాయించాల్సి ఉంటుందని తెలుస్తోంది.మెగా బ్రదర్ నాగబాబు రాజ్యసభకు నామినేట్ అవుతారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టిటిడి అధ్యక్ష పదవి నాగబాబుకు ఆఫర్ చేసినట్లు ప్రచారం జరిగింది.ఆయన మాత్రం రాజ్యసభ పదవి కావాలని అడిగినట్లు తెలుస్తోంది.దీనికి చంద్రబాబు సైతం ఆమోదముద్ర వేసినట్లు సమాచారం.అదే వాస్తవం అయితే రాజ్యసభ సీట్లలో నాగబాబుకు ఒకటి ఖాయం.

    * అనుకోని అవకాశం గా ఆమెకు
    అయితే చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నందమూరి కుటుంబానికి ఒక రాజ్యసభ పదవి ఇవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ముఖ్యంగా హరికృష్ణ కుమార్తె సుహాసిని కి ఛాన్స్ ఇస్తారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె తెలంగాణ తెలుగుదేశంలో యాక్టివ్ గా ఉన్నారు. పైగా హరికృష్ణ కుమార్తె. ప్రస్తుతం పార్టీ తో పాటు కుటుంబానికి జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ దూరంగా ఉన్నారు. నందమూరి కుటుంబంలో విభేదాలు ఉన్నాయని కూడా ఒక టాక్ నడుస్తోంది. అందుకే సుహాసిని కి రాజ్యసభ పదవి ఇస్తే తారక్ తో పాటు కళ్యాణ్ రామ్ కు చెక్ పడినట్లు అవుతుంది. అదే సమయంలో తెలంగాణలో పార్టీకి ప్రయోజనం కలుగుతుంది. అందుకే చంద్రబాబు నందమూరి సుహాసిని వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.