Homeక్రీడలుParalympics 2024: నాలుగడుగుల 4 అంగుళాల ఎత్తు.. 34 సంవత్సరాల వయసు.. పారా ఒలంపిక్స్ లో...

Paralympics 2024: నాలుగడుగుల 4 అంగుళాల ఎత్తు.. 34 సంవత్సరాల వయసు.. పారా ఒలంపిక్స్ లో ఐదు గోల్డ్ మెడల్స్.. ఈ అథ్లెట్ గురించి తెలుసా..

Paralympics 2024: పారిస్ వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో యూనిషియా దేశానికి చెందిన షాట్ పుటర్ రవా టిల్లి సరికొత్త చరిత్ర సృష్టించింది. పారా ఒలింపిక్స్ లో ఐదోసారి స్వర్ణ పతకం సాధించి అద్భుతమైన ఘనతను తన సొంతం చేసుకుంది.. కేవలం నాలుగు అడుగుల నాలుగు అంగుళాల పొడవు ఉన్న టిల్లీ వయసు 34 సంవత్సరాలు. ఇనుప గుండును 10.40 మీటర్ల దూరం విసిరి మొదటి స్థానంలో నిలిచింది. 2008, 2012 క్రీడలలో షాట్ ఫుట్ క్రీడలో స్వర్ణాలను నెగ్గింది. 2016, 2021 క్రీడలలో డిస్కస్ త్రో లో గోల్డ్ మెడల్స్ దక్కించుకుంది. పారిస్ లోనూ షాట్ ఫుట్ ఈవెంట్ లో విజేతగా నిలిచింది. వరుసగా ఐదో క్రీడా పోటీలో స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇలా వరుసగా ఐదు స్వర్ణాలు సాధించడం ద్వారా టిల్లీ అరుదైన ఘనతను తన సొంతం చేసుకుంది..షాట్ పుట్, డిస్కస్ త్రో విభాగాలలో స్వర్ణాలు సాధించిన అథ్లెట్ గా టిల్లి సరికొత్త చరిత్ర సృష్టించింది.

చిన్నప్పటినుంచి ఎత్తు తక్కువగా ఉన్న టిల్లిని చుట్టుపక్కల వారు హేళన చేసి మాట్లాడేవారు.. దీంతో ఆమె తీవ్రంగా ఇబ్బంది పడేది. కుటుంబ సభ్యులు, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉండడంతో క్రీడాకారిణిగా తనను తాను ఆవిష్కరించుకుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొని ధ్రువతారగా ఆవిర్భవించింది.. ఏకంగా పారా ఒలంపిక్స్ లో ఐదు స్వర్ణాలు సాధించేదాకా విశ్రమించలేదు. ఐదవ స్వర్ణం సాధించిన తర్వాత టిల్లి ఉద్వేగంగా మాట్లాడింది. ” ఈ ప్రయాణం బాగుంది. ఉద్వేగంగా అనిపిస్తోంది. ఉద్విగ్నంగా ప్రతిక్షణం సాగిపోయింది. విజేతగా నిలిచిన తర్వాత నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నాను. ఇంతటి ఘన చరిత్ర వెనుక నా బాధ దాగుంది. నా కష్టం దాగి ఉంది. ఇన్ని విజయాల తర్వాత అవన్నీ అద్భుతంగా దర్శనమిస్తున్నాయి. ఇంతకంటే నేను ఎక్కువగా ఏమీ చెప్పలేనని” టిల్లి వ్యాఖ్యానించింది.

వరుసగా ఐదు స్వర్ణాలు సాధించడంతో టిల్లీని ట్యూనిషియా వాసులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మా దేశానికి లభించిన క్రీడారత్నం అంటూ పొగుడుతున్నారు. ఎంతమంది యువతకు స్ఫూర్తిగా నిలిచిందంటూ టిల్లిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. “ఆమె గొప్పగా రాణించింది. స్ఫూర్తిని ప్రదర్శించింది. అలాంటి మహిళ మా దేశ వాసు రాలు కావడం గర్వకారణంగా ఉంది. ఈ ఆట తీరును భావితరాలు గుర్తుంచుకుంటాయి. ఆమె చూపించిన బాటను అనుసరిస్తాయి. క్రీడల్లో మా దేశానికి మరింత గుర్తింపు తీసుకొస్తాయి. ఈ మాట అనడంలో మాకు ఎటువంటి సందేహం లేదని” ట్యునీషియా వాసులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version