Sarfaraz Khan: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ గదను దక్కించుకోవాలని టీమిండియా భావిస్తున్న ఈ తరుణంలో ఇలాంటి ప్రతిఘటన ఎదురు కావడం కెప్టెన్ రోహిత్ నే కాదు.. సగటు భారతీయ అభిమానిని కూడా ఇబ్బందికి గురి చేసింది. మిగతా ఆటగాళ్ల సంగతి పక్కన పెడితే ఇక నాటి నుంచి రోహిత్ ముభావంగా ఉంటున్నాడు. తీవ్రమైన విచారంతో కనిపిస్తున్నాడు. రెండవ ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ చేసినప్పటికీ రోహిత్ లో ఆ ఆనందం లేదు. అయితే అతడి ముఖంలో టీమిండియా యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ ఆనందాన్ని రప్పించాడు. నవ్వును విరబూయించాడు. బెంగళూరు టెస్టులో ఆశలను రేకెత్తించాడు. న్యూజిలాండ్ జట్టుపై జరుగుతున్న తొలి టెస్ట్ లో 109 బాల్స్ లో సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు సర్ఫరాజ్. టెస్ట్ క్రికెట్లో అతడికి ఇదే తొలి సెంచరీ. కీలక సమయంలో సూపర్ బ్యాటింగ్ చేశాడు. వీరోచితమైన శతకం బాదాడు. తనకు లభించిన అవకాశాన్ని అద్భుతంగా అందిపుచ్చుకున్నాడు. న్యూజిలాండ్ బౌలర్ సౌథి వేసిన 57 ఓవర్ మూడో బంతిని ఫోర్ కొట్టి.. సెంచరీ చేశాడు. సెంచరీ చేసిన అనంతరం సర్ఫ రాజ్ దగ్గరగా అరిచాడు. ఇదే సమయంలో డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న ఆటగాళ్లు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చి.. సర్ఫరాజ్ ను అభినందించారు. చప్పట్లు కొడుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రోహిత్ శర్మ నవ్యాడు. సర్ఫరాజ్ ఇన్నింగ్స్ ను మనసారా అభినందించాడు. అయితే ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ మనస్ఫూర్తిగా నవ్విన సందర్భం ఇదేనని జాతీయ మీడియా చెబుతోంది. తొలి టెస్ట్ లో టాస్ గెలిచిన నాటి నుంచి మొదలు పెడితే శనివారం దాకా రోహిత్ పూర్తిగా అసంతృప్తిలో ఉన్నాడు. అయితే సర్ఫరాజ్ సెంచరీ చేయడంతో ఒక్కసారిగా నవ్వాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది.
నిలకడగా ఆడుతోంది
సర్ప రాజ్ సెంచరీ చేయడంతో టీమిండియా మెరుగైన స్థితిలో కనిపిస్తోంది.231/3 ఓవర్ నైట్ స్కోర్ తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా 71 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 343 పరుగులు చేసింది. సర్ఫరాజ్ (125), పంత్ (53) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. టీమిండియా ఇంకా 12 పరుగుల వెనుకంజలో ఉంది. ప్రస్తుతం బెంగళూరులో వర్షం ప్రారంభం కావడంతో మ్యాచ్ నిలుపుదల చేశారు. వర్షం బాగా కురుస్తున్న నేపథ్యంలో ఆటసాగే పరిస్థితులు లేవని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒకవేళ వర్షం తగ్గి.. వరద నీరును బయటికి పంపిన తర్వాత.. మ్యాచ్ ప్రారంభిస్తారు. అయితే తొలి రోజు కూడా వర్షం వల్ల ఆట ఇలాగే తుడిచిపెట్టుకుపోయింది.. రెండవ రోజు వర్షం లేకపోవడంతో మ్యాచ్ ప్రారంభించారు. టాస్ గెలిచిన టీమిండియా కేవలం 46 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఆ తర్వాత న్యూజిలాండ్ 402 పరుగుల భారీ స్కోరు చేసింది. తద్వారా ఆ జట్టుకు 356 రన్స్ లభించింది. ఇక ఇదే క్రమంలో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా దూకుడుగా బ్యాటింగ్ మొదలుపెట్టింది. యశస్వి జైస్వాల్ (35), రోహిత్ శర్మ (52), విరాట్ కోహ్లీ (70), సర్ఫరాజ్ ఖాన్ (125*), రిషబ్ పంత్ (53*) అజేయంగా నిలిచారు.
The mood of the dressing room changed from to in 2 days. pic.twitter.com/sY2CCZvCaF
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 19, 2024