Erram Naidu Grandson: తెలుగుదేశం పార్టీలో( Telugu Desam Party) కింజరాపు ఎర్రం నాయుడుది ప్రత్యేక స్థానం. చంద్రబాబుకు కుడి భుజంగా ఉండేవారు. పార్టీలో నెంబర్ 2 గా కూడా ఎదిగారు. ఎర్రం నాయుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తర్వాత చంద్రబాబు ఎంతో బాధపడ్డారు. పార్టీ కష్ట కాలంలో ఉంటే తనకు అండగా నిలబడేది ఎవరు అంటూ దిగులు చెందారు. ఆ సమయంలోనే ఎర్రం నాయుడు తనయుడు రామ్మోహన్ నాయుడు తెరపైకి వచ్చారు. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. మంచి వాగ్దాటితో గుర్తింపు సాధించారు. అధినేత చంద్రబాబుకు ఇష్టమైన నేతగా మారారు. నారా లోకేష్ తో చక్కగా పనిచేస్తున్నారు. చంద్రబాబుతో ఎర్రం నాయుడు అనుబంధాన్ని.. లోకేష్ తో రామ్మోహన్ నాయుడు కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా కింజరాపు కుటుంబంలోకి మూడో తరం వారసుడు ఎంట్రీ ఇచ్చారు. ఆ వారసుడ్ని చూసి చంద్రబాబు పులకించుకుపోయారు. తన స్నేహితుడు ఎర్రం నాయుడు మళ్లీ పుట్టాడు అంటూ ఆనందం వ్యక్తం చేశారు.
Also Read: అక్టోబర్ లో రాజకీయ ప్రకంపనలు!
ఇటీవలే మగ బిడ్డ జననం
ఇటీవల కింజరాపు రామ్మోహన్ నాయుడు( kinjarappu Ram Mohan Naidu) , శ్రావ్య దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. గతంలో ఆ జంటకు ఆడపిల్ల పుట్టగా.. రెండో సంతానంగా ఇటీవల బాబు పుట్టాడు. దీంతో శ్రీకాకుళం జిల్లాలో టిడిపి శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి. సోషల్ మీడియా వేదికగా ఎర్రం నాయుడు మళ్ళీ పుట్టాడు, లయన్ ఇజ్ బ్యాక్ అంటూ పోస్టులు కూడా పెట్టారు. 2012 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎర్రం నాయుడు మృతి చెందారు. ఆయన అకాల మరణంతో రామ్మోహన్ నాయుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. మూడుసార్లు శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. 2024 ఎన్నికల్లో గెలవడంతో.. ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి కావడంతో.. కింజరాపు రామ్మోహన్ నాయుడు కు పౌర విమానయాన శాఖ దక్కింది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు రామ్మోహన్ నాయుడు.
Also Read: టిడిపి ఎమ్మెల్యేలకు వైసీపీ ట్రాప్.. చంద్రబాబు సీరియస్!
రామ్మోహన్ నాయుడు ఇంటికి వెళ్లి..
ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు నివాసానికి సీఎం చంద్రబాబు శుక్రవారం సాయంత్రం వెళ్లారు. రామ్మోహన్ నాయుడు, శ్రావ్య దంపతులకు జన్మించిన కుమారుడికి ఆశీస్సులు తెలిపారు చంద్రబాబు. ఆ బాబును ఎత్తుకొని మురిసిపోయారు. తన మిత్రుడు ఎర్రం నాయుడు మళ్లీ పుట్టాడు అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఎర్రం నాయుడు సతీమణి విజయమ్మ కూడా అక్కడే ఉన్నారు. రామ్మోహన్ నాయుడు భార్య శ్రావ్య మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కుమార్తె. మొన్నటి ఎన్నికల్లో బండారు సత్యనారాయణమూర్తి విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఎర్రం నాయుడు చంద్రబాబు నాయుడుతో పని చేశారు. రామ్మోహన్ నాయుడు లోకేష్ తో కలిసి అడుగులు వేస్తున్నారు. రామ్మోహన్ నాయుడు తనయుడు భవిష్యత్తులో నారా లోకేష్ కుమారుడు దేవాన్సుతో అడుగులు వేస్తారని టిడిపి శ్రేణులు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నాయి.