Bank Loan Eligibility: ప్రస్తుత కాలంలో ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి. కొందరు అదనపు ఆదాయం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అంతకుమించిన అప్పులే అవుతున్నాయి. ఇలాంటి సమయంలో బ్యాంకు రుణాలు తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా అవుతుంది. ఒకప్పుడు డబ్బు అవసరం ఉంటే ఇతరుల వద్ద అడిగి తీసుకునేవారు. దీనికి వడ్డీ ఎక్కువగా విధించేవారు. అయితే ఇప్పుడు బ్యాంకులో వెంటబడి మరీ లోన్ ఇస్తున్నాయి. బ్యాంకు లోన్ తక్కువగా ఉండడంతో చాలామంది వీటి పైన ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే బ్యాంకు లోన్ అందరికీ ఇవ్వడం సాధ్యం కాదు. బ్యాంకు లోన్ ఇవ్వాలంటే ఖాతాదారులు కొన్ని అర్హతలు సాధించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది తప్పనిసరి అని బ్యాంకులో అంటున్నాయి. ఇంతకూ అది ఏంటంటే?
Also Read: ఈ మూడు నెంబర్లు మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్..
మొన్నటి వరకు బ్యాంకు లోన్ ఇవ్వాలంటే అనేక రకాల డాక్యుమెంట్స్ అవసరం ఉండేది. ఆధార్ కార్డు, పాన్ కార్డు తో పాటు ఎంత ఆదాయం వస్తుందో దానికి సంబంధించిన వివరాలు ఇవ్వాల్సి ఉండేది. అయితే ఇప్పుడు బ్యాంకుతోనే అన్ని రకాల వ్యవహారాలు జరుపుతున్నారు. అలాగే బ్యాంకు అకౌంట్ తో ఆధార్ కార్డు, పాన్ కార్డు లింక్ అయ్యే ఉంటుంది. దీంతో బ్యాంకుకు ఒక ఖాతాదారునికి సంబంధించిన అన్ని వివరాలు ఉంటున్నాయి. ఈ క్రమంలో ఒక ఖాతాదారుడు లోన్ తీసుకోవాలంటే అతని ఆధార్ కార్డు నెంబర్ చెబితే చాలు.. పూర్తి వివరాలు బయటకు వస్తాయి. అయితే ఇదే సమయంలో ఖాతాదారుడు ఎలాంటి ట్రాన్సాక్షన్ నిర్వహించాడు? ఎలాంటి తప్పులు చేశాడు? అనే విషయాలు కూడా బయటపడతాయి. ఆ తప్పులు, ట్రాన్సాక్షన్ వివరాలను తెలిపేదే క్రెడిట్ స్కోర్. క్రెడిట్ స్కోర్ బాగుంటేనే ఖాతాదారుడికి ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.
అయితే ప్రస్తుతం బ్యాంకు లోన్ ఇచ్చేవారు ఖాతాదారుడికి సంబంధించిన మిగతా వివరాలకంటే క్రెడిట్ స్కోర్ తప్పనిసరిగా చూస్తున్నారు. క్రెడిట్ స్కోర్ 700 కంటే పైన ఉంటేనే బ్యాంకు లోన్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. చాలామంది బ్యాంకు ద్వారా ఎన్నో రకాల వ్యవహారాలు జరుపుతూ ఉంటారు. అయితే ఒక్కోసారి చిన్నచిన్న ఈఎంఐలు మిస్ చేస్తూ ఉంటారు. ఇవి చూడడానికి చిన్నవే అనిపించినా.. రాను రాను వాటి ప్రభావం బ్యాంకు లోన్ లేదా ఇతర ఆర్థిక వ్యవహారాలపై పడుతుంది. అలాగే కొందరు అవసరం లేకున్నా క్రెడిట్ కార్డులు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. వీటిని సరైన విధంగా వాడకపోయినా.. వీటిలో కొన్ని పొరపాట్లు చేసినా కూడా క్రెడిట్ స్కోర్ పై ప్రభావం పడుతుంది. అందువల్ల క్రెడిట్ స్కోర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కొందరు బ్యాంకు నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: డాక్టర్స్ రాసిన ప్రిస్క్రిప్షన్ అర్థం కావడం లేదా? అయితే వాట్సాప్ లో ఇలా చేయండి..
అంతేకాకుండా ఎప్పటికప్పుడు క్రెడిట్ స్కోర్ ను చెక్ చేసుకుంటూ ఉండాలని తెలుపుతున్నారు. కొన్ని యాప్స్ లో క్రికెట్ స్కోర్ ఉచితంగా తెలియజేస్తారని.. అయితే వీటికి సంబంధించిన పూర్తి రిపోర్ట్ కావాలంటే మాత్రం బ్యాంకుకు వెళ్లి తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే దానిని పెంచుకునేందుకు ఏం చేయాలో బ్యాంకు వారిని సంప్రదించాలని చెబుతున్నారు.