Amaravati 3D Technology: అమరావతి రాజధాని( Amravati capital ) నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలన్న సంకల్పంలో కూటమి ప్రభుత్వం ఉంది. 2028 నాటికి రాజధానికి ఒక రూపం తేవాలని చంద్రబాబు భావిస్తున్నారు. అమరావతిని పూర్తిచేశామన్న సంకేతాలు ఇచ్చి 2029 ఎన్నికలకు వెళ్లాలన్నది ప్రణాళిక. అమరావతి రాజధాని నిర్మాణ పనులను పునః ప్రారంభించారు ప్రధాని మోదీ. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తొలి ఏడాది నిధుల సమీకరణ పై దృష్టి పెట్టింది. అది కొలిక్కి వచ్చిన తరువాతే అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించింది. అయితే ప్రధాని మోదీ మరోసారి అమరావతికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెలలో ప్రధాని అమరావతిలో కీలక నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. పనిలో పనిగా ప్రధానిని ఆహ్వానించనున్నట్లు సమాచారం.
Also Read: ఏపీలో హెలిక్యాప్టర్ పై జాలీగా.. మూడు చోట్ల మినీ ఎయిర్ పోర్టులు
ప్రతిష్టాత్మకంగా క్వాంటం వ్యాలీ..
అమరావతిలో క్వాంటం వ్యాలీని( Quantum vyali) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఐకానిక్ భవనం నిర్మించాలని ప్రణాళిక వేసుకున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని ప్రత్యేకత ఉండేలా ఆకృతి ఎంపికలు జాగ్రత్తలు తీసుకుంటుంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే పలు నిర్మాణ సంస్థలు ఈ నమూనాలను ఇచ్చాయి. 40000 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఈ ఐకానిక్ భవనం నిర్మించాలన్నది ప్రతిపాదన. మొత్తం వ్యాలీలో దశలవారీగా 90 లక్షల చదరపు అడుగుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది. వివిధ కంపెనీలు, స్టార్టప్ లు, పరిశోధనలు నిర్వహించే సంస్థలకు ఇందులో స్థలం కేటాయించనుంది. అందుకే ప్రపంచ నగరాల్లో వివిధ ఐకానిక్ భవనాలకు ఉన్న ఆకృతులకు భిన్నంగా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.
ప్రపంచ నగరాల సరసన..
ప్రపంచ నగరాల్లో అమరావతి రాజధానిని నిలపాలన్నది చంద్రబాబు( CM Chandrababu) ప్రణాళిక. అందుకే ఐకానిక్ భవనాన్ని ఆ స్థాయిలో నిర్మించాలని నిర్ణయించారు. పూర్తిగా 3d ప్రింటింగ్ పరిజ్ఞానంతో దీనిని నిర్మించనున్నారు. ప్లాస్టిక్, టైటానియం మెటీరియల్ వినియోగించి త్రీడీ ప్రింటింగ్ లో బ్లాక్లు రూపొందిస్తారు. ఇటుకకు బదులు బయోమాస్ట్ విధానంలో.. కంప్రెసెడ్ హీటింగ్ ద్వారా తయారుచేసిన ఇటుకలను మాత్రమే వాడనున్నారు. సాధారణ ఇటుకలతో పోలిస్తే ఇవి చాలా దృఢంగా ఉంటాయి. అయితే ఈ ఐకానిక్ భవనానికి సంబంధించి వివిధ ఆకృతులను ప్రభుత్వం ఎంపిక చేసింది. అందులో ఒక దానిని ఎంపిక చేసింది. క్వాంటం వ్యాలీ ప్రకటించిన తర్వాత నుంచి ఈ ఆకృతుల ఎంపిక ప్రారంభం అయింది. దీనిపై చాలాసార్లు సమీక్షించారు సీఎం చంద్రబాబు. రెండు రోజుల తర్వాత ఒక ఆకృతిని ఎంపిక చేశారు. ఇప్పుడు ఆకృతి ఎంపిక కొలిక్కి రావడంతో టెండర్లు పూర్తిచేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
Also Read: ‘ఎర్రంనాయుడు’ను చూసి మురిసిపోయిన చంద్రబాబు!
ప్రధానితో శంకుస్థాపన..
ఐకానిక్ భవనం( iconic building ) నిర్మాణానికి సంబంధించి సెప్టెంబర్ మొదటి వారంలో శంకుస్థాపన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదేరోజు ఎంపిక చేసిన భవన ఆకృతిని విడుదల చేయనుంది. ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించి ఐకానిక్ భవన నిర్మాణ పనులు ప్రారంభించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు ప్రధాని మోదీని ప్రత్యేకంగా ఆహ్వానిస్తారని సమాచారం. ప్రధానితో భవన నిర్మాణాన్ని ప్రారంభించి వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ఆలోచన చేశారు. అలాగే క్వాంటం వ్యాలీని వచ్చే ఏడాది జనవరి 1న ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే అమరావతి వైపు ప్రపంచం చూసేలా ఈ నిర్మాణాలను ప్రారంభించేందుకు చంద్రబాబు గట్టి చర్యలు తీసుకున్నారు.