Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu And Vangaveeti Radha Krishna: ‘కాపు’ల కొట్లాట : వైసిపికి వంగవీటి రాధా తో...

Chandrababu And Vangaveeti Radha Krishna: ‘కాపు’ల కొట్లాట : వైసిపికి వంగవీటి రాధా తో చంద్రబాబు చెక్!

Chandrababu And Vangaveeti Radha Krishna: కొంతమంది రాజకీయ నిర్ణయాలు ప్రతికూలతలు చూపుతాయి. తప్పుడు నిర్ణయాలు రాజకీయంగా ఇబ్బందులు తెచ్చి పెడతాయి. అటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు వంగవీటి రాధాకృష్ణ( vangaveeti Radha Krishna ). కాపులు ఆరాధ్య దైవంగా భావించే వంగవీటి మోహన్ రంగా కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రాధాకృష్ణ అనుకున్న స్థాయిలో రాణించక పోవడానికి ప్రధాన కారణం రాజకీయంగా తీసుకున్న నిర్ణయాలే. తండ్రి మాదిరిగా రాజకీయ ప్రభావం చూపించలేకపోయారు. ఒకేసారి ఎమ్మెల్యే పదవికి మాత్రం పరిమితం అయ్యారు. దాదాపు పాతికేళ్ల రాజకీయ జీవితంలో కేవలం ఐదు సంవత్సరాల పాటు మాత్రమే చట్టసభల్లో ఉన్నారు. తన తండ్రి మాదిరిగా చరిష్మ కలిగిన నేతగా మాత్రం మార లేకపోయారు. అయితే ఇప్పుడు తాజాగా ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు.. వంగవీటి రాధాకృష్ణను పదవిని తెచ్చి పెట్టేలా ఉన్నాయి.

* అంబటి అరెస్టుతో..
ఇటీవల సీఎం చంద్రబాబుపై( AP CM Chandrababu) అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు జరిగింది. అయితే అంబటి రాంబాబు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రచారానికి తెరతీసింది. కాపులను కూటమి అణచివేస్తోందని.. కాపులపట్ల వ్యతిరేకత చూపుతోందని ప్రచారం మొదలు పెట్టింది. చివరకు జగన్మోహన్ రెడ్డి సైతం కాపు నేతలతో ఇదే తరహా ఆరోపణలు చేయడం ప్రారంభించారు. అయితే దీనిని కూటమి లెక్క చేయలేదు కానీ లోలోపల మాత్రం.. గత అనుభవాల దృష్ట్యా భయపడుతోంది. వచ్చే మూడు సంవత్సరాల లో కాపుల విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమిపై విమర్శలు చేయకుండా ఒక భారీ వ్యూహానికి తెర తీసినట్లు తెలుస్తోంది చంద్రబాబు. అందులో భాగంగానే రెండు రోజుల కిందట వంగవీటి రాధాకృష్ణను పిలిచి చంద్రబాబు మాట్లాడినట్లు సమాచారం. వంగవీటి రాధాకృష్ణకు రాజ్యసభ పదవి ఇచ్చి కాపులకు సరైన మెసేజ్ పంపాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

* కాపు వ్యతిరేక ప్రచారానికి..
వంగవీటి రాధాకృష్ణ సరైన రాజకీయ నిర్ణయాలు తీసుకోలేదు. ఆయనకు ఇప్పుడు రాజ్యసభ పదవి ఇస్తే మాత్రం టిడిపి కూటమికి మైలేజ్ వస్తుంది. కాపుల్లో కూటమి ఇమేజ్ పెరుగుతుంది. కాపుల విషయంలో ఈసారి వైసిపి ఎటువంటి వ్యాఖ్యానాలు చేయలేదు. వంగవీటి మోహన్ రంగా కుమారుడు రాధాకృష్ణకు వైసిపి అన్యాయం చేసింది. తాము న్యాయం చేసామని కూటమి చెప్పేందుకు అవకాశం కలుగుతుంది. మరోవైపు రాధాకృష్ణను రంగంలోకి దింపడం ద్వారా వైసీపీలో ఉన్న కాపు నేతలను మరింత డిఫెన్స్ లో పెట్టవచ్చు. చివరిసారిగా.. తొలిసారిగా 2009లో ఎమ్మెల్యే అయ్యారు వంగవీటి రాధాకృష్ణ. దాదాపు పుష్కర కాలంగా ఆయన పదవులకు దూరంగా ఉన్నారు. రాజ్యసభ ఇస్తే ఆయనకు పొలిటికల్ రిలీఫ్ దక్కుతుంది. కూటమికి కాపు వ్యతిరేక టెన్షన్ తప్పుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular