Chandrababu: ఆర్కే కొత్త పలుకు కొంతమందికి నచ్చవచ్చు. మరికొంతమందికి నచ్చకపోవచ్చు. ఆయనప్పటికీ అతడు తన రాతలు మానుకోలేడు. తను చెప్పాల్సిన విషయాలను చెప్పకుండా ఉండలేడు.. ఇక తాజాగా రాసిన కొత్త పలుకులో అమరావతి గురించి చెప్పుకొచ్చాడు రాధాకృష్ణ. సహజంగా ఆయనకు ఇష్టమైన వ్యక్తులు ఇప్పుడు ఆంధ్రాలో పరిపాలన చేస్తున్నారు కాబట్టి.. ఆయన తన ఆసక్తి కొద్ది అమరావతి గురించి కొంచెం లోతైన విషయాలు వెల్లడించారు. అమరావతి నిర్మాణం గురించి.. రైతుల దగ్గర నుంచి సేకరించిన భూముల గురించి… ఇంకా సేకరించాల్సిన భూముల గురించి ఏకరువు పెట్టుకుంటూ పోయారు. కాకపోతే సింగపూర్ గ్రాఫిక్స్ బొమ్మలు.. సింగపూర్ కంపెనీతో కుదుర్చుకున్న ఎంవోయూలు.. ఇవన్నీ పక్కన పెట్టాడు రాధాకృష్ణ.
Also Read: రేషన్ అమ్ముకుంటున్నారా? ఇక మీకు రేషన్ కార్డ్ కట్!
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి నిర్మాణం విషయంలో ఒక్క అడుగు కూడా ఎందుకు ముందుకు పడలేదో చెప్పలేకపోయాడు రాధాకృష్ణ. నిజమే రోమ్ నగరం కూడా ఒక్కరోజులోనే నిర్మితం కాలేదు. అమరావతి నిర్మాణం కూడా ఒక్క రోజులోనే సాధ్యమయ్యే పనికాదు. ఇప్పుడు విశ్వవిఖ్యాత నగరంగా పేరుపొందిన హైదరాబాద్ కూడా ఒక్క రోజులోనే ఇంత అభివృద్ధి చెందలేదు. ఒకప్పుడు మత గొడవలు ఉన్నాయి. అనేక చికాకులు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ దాటుకుని హైదరాబాద్ ఇవాళ ఈ స్థాయిలో నిలబడింది అంటే దానికి ప్రధాన కారణం.. ఇక్కడి ప్రజల్లో ఉన్న ఐకమత్యమే. కానీ ఇలాంటి ఐకమత్యం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో లేదంటాడు రాధాకృష్ణ. సున్నితమైన రాష్ట్రమని.. కులాల ఇబ్బందులు ఉంటాయని.. వర్గాల మధ్య విభేదాలు ఉంటాయని రాధాకృష్ణ బాధపడ్డాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాల మధ్య కుంపట్లు రాజేసింది ఎవరు.. ఆ మంటలతో చలికాచుకునేది ఎవరు.. ఇప్పటికీ చంద్రబాబు ప్రభుత్వంలో ఏ సామాజిక వర్గం పెత్తనం సాగిస్తోంది.. అక్కడిదాకా ఎందుకు రాధాకృష్ణ నడిపిస్తున్న పత్రికలో ఏ సామాజిక వర్గం వారి హవా నడుస్తోంది? సొంత పత్రికలో పనిచేస్తున్న ఉద్యోగులే రాధాకృష్ణకు దిమ్మ తిరిగే విధంగా సమాధానం చెప్పగలరు. ఈయన ఏదో సర్వ పరిత్యాగిలాగా.. చంద్రబాబు నిర్మిస్తున్న అమరావతిలో ఏ సామాజిక వర్గం వారికి ప్రాతినిధ్యం లేదని చెప్పుకొస్తున్నాడు. ఒకవేళ రాధాకృష్ణ చెప్పినట్టు ఓ సామాజికం వర్గం వారికే అక్కడ ప్రాతినిధ్యం లేకపోతే రాధాకృష్ణ ఇంతలా ఎందుకు డబ్బు కొడుతున్నాడు.. ఇంతలా ఎందుకు మోస్తున్నాడు?
ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుందా?
కొత్త పలుకు వ్యాసంలో రైతుల నుంచి సేకరించిన భూమిని అభివృద్ధి చేసి ప్రభుత్వం విక్రయిస్తుందని రాధాకృష్ణ రాసుకొచ్చాడు. అంటే ఈ లెక్కన ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది అని అనుకోవాలి.. అంటే దీనినే అభివృద్ధి అని చెప్పాలా.. ఈ మాత్రం దానికి ఎన్ని వేల కోట్ల వ్యయం ఎందుకు? ఇంత హంగామా ఎందుకు? హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం ఒక పరిధి వరకు మాత్రమే భూములు అభివృద్ధి చేసి అమ్ముతుంది.. అలాగని ఆ భూములను రైతుల నుంచి సేకరించలేదు. ఈ మాత్రం లాజిక్ కూడా తెలియని రాధాకృష్ణ అమరావతి గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు. ఏపీలో సామాజిక వర్గాల మధ్య స్నేహపూర్వక వాతావరణం లేదు. ప్రాంతాల మధ్య కూడా సముచిత సామాజిక భావనలేదు. అమరావతి రాజధాని అయితే కొన్ని జిల్లాలు మాత్రమే అభివృద్ధి చెందుతాయని అపోహ ఉంది. ఆ అపోహను తొలగించాల్సిన బాధ్యత పాలకుడిగా చంద్రబాబుది. ఈ విషయాన్ని పక్కన పెట్టి జగన్ కోడి కత్తి.. గొడ్డలి.. అరటి తోటలు తగలబెట్టారు.. మారిచులు.. రాక్షసులు అని వ్యాఖ్యలు చేయడం దేనికి రాధాకృష్ణా! రాజధాని నిర్మాణ విషయంలో చంద్రబాబును భయపెట్టే ప్రయత్నమా ఇదీ! జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లో మరింత చులకన చేసే ఉద్దేశమా ఇదీ! 2019లో జరిగిన ఎన్నికల్లో ఇదే అమరావతి ప్రాంతంలో వైసిపి ఎలాంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అలాగని