Germs on Household items : ప్రస్తుత కాలంలో వ్యాధులకు కొదవలేదు అన్నట్లుగా మారింది. వయసు తేడా లేకుండా చాలామంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. కొందరు చిన్న ఇన్ఫెక్షన్ కి అనారోగ్యానికి గురై ఆస్పత్రుల పాలవుతున్నారు. ఒకప్పుడు ఎలాంటి జాగ్రత్తలు లేకుండా ఉన్నవారు సైతం ఎలాంటి అనారోగ్యాలకు గురి కాలేదు. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి అని కొందరు విశ్లేషించగా.. పరిశుభ్రత లేకపోవడమే అని చాలామంది అంటున్నారు. నేటి కాలంలో ప్రతి ఒక్కరిది ఉరుకులు పరుగుల జీవితమే. దీంతో ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించడం లేదు. చిన్న చిన్న విషయాలైనా పట్టించుకోకపోవడంతో అనేక అనారోగ్యాలకు గురవుతున్నారు. ముఖ్యంగా రోజువారి మనం వాడే వస్తువులపైనే అనేక క్రిములు ఉంటాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. టాయిలెట్ లో ఉండే వాటికంటే ఈ వస్తువుల పైనే ఎక్కువగా క్రిములు ఉంటాయని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు చూద్దాం..
Also Read : ఇంట్లో గదులకు ఎలాంటి రంగులు మంచివి?
ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో టెలివిజన్ కచ్చితంగా ఉంటుంది. ఒకప్పుడు ట్యూనర్ టీవీ ఉండేది. కానీ ఇప్పుడు స్మార్ట్ టీవీ వచ్చిన తర్వాత రిమోట్ తో ఆపరేట్ చేస్తున్నారు. అయితే ఈ రిమోట్ పై ఎన్నో రకాల క్రిములు దాగి ఉంటాయి. ఈ రిమోట్ ను చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు మార్చి మార్చి ఆపరేట్ చేస్తూ ఉంటారు. కానీ రిమోట్ ను వాడిన తర్వాత వెంటనే ఏదైనా ఆహార పదార్థాలను తింటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల రిమోట్ పై ఉండే క్రిములు చేతుల ద్వారా నోటిలోకి వెళ్లే ప్రమాదముంది. దీంతో తొందరగా అనారోగ్యానికి గురి అయ్యే అవకాశం ఉంది.
నేటి కాలంలో చాలామంది సాఫ్ట్వేర్ జాబు చేసేవారు ఎక్కువగా ఉన్నారు. వీరందరూ కంప్యూటర్లపై పనిచేస్తూ ఉంటారు. అయితే కంప్యూటర్ ముందు ఉండే కీబోర్డ్ పై అనేక రకాల క్రిములు ఉంటాయి. ఇవి టాయిలెట్ లో ఉండే వాటికంటే ఎక్కువగా ఉంటాయి. కానీ చాలామంది కీబోర్డుపై ఆపరేట్ చేసి వెంటనే ఏదైనా ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల తొందరగా అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. అందువల్ల కీబోర్డ్ పై ఆపరేట్ చేసేవారు ఏదైనా ఆహారం తినే ముందు చేతులు కడుక్కోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
కొందరు వాడే దుస్తుల్లోనూ అనేక రకాల క్రిములు ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా చెమట ఎక్కువగా వచ్చేవారు వారు తమ దుస్తులను వదిలినప్పుడు వాటిపై ఉండే క్రిములు చేతికి వస్తాయి. ఈ చేతులను కడుక్కోకుండా ఉంటే ప్రమాదమేనని అంటున్నారు. అందువల్ల చెమట ఎక్కువగా ఉన్నప్పుడు దుస్తులను తీసేసినప్పుడు చేతులను కడుక్కోవాలని అంటున్నారు.
ఇక నేటి కాలంలో చాలామంది మొబైల్ వాడుతూ ఉంటారు. మొబైల్ స్క్రీన్ పై కూడా ఎన్నో రకాల క్రిములు ఉంటాయన్న విషయం చాలామందికి తెలియదు. మొబైల్ స్క్రీన్ పై ఆపరేట్ చేసిన తర్వాత ఒకవేళ ఆహార పదార్థాలు తినాల్సి వస్తే చేతులు కడుక్కోవాలని చెబుతున్నారు. అలా చేయనిపక్షంలో అనారోగ్యానికి గురై అవకాశం ఉందని అంటున్నారు.