Chandrababu : టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులపై చంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష చేపట్టారు. వైసీపీ నేతల దాడికి నిరసనగా గురువారం ఉదయం 8 గంటల నుంచి రేపు రాత్రి 8 గంటల వరకు దీక్ష కొనసాగించనున్నారు. మంగళగిరి కార్యాలయంలో చంద్రబాబు దీక్షకు పూనుకోగా లోకేష్, రాష్ర్ట అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పర్ల రామయ్య, యనమల రామకృష్ణుడు, ఆలపాటి రాజా, ప్రత్తిపాటి పుల్లారావు, నిమ్మల రామానాయుడు, రామ్మోహన్ దీక్లలో కూర్చున్నారు.

రాష్ర్టంలో రాక్షసపాలన కొనసాగుతుందని నేతలు దుయ్యబట్టారు. రాష్ర్టపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడుల మీద సీబీఐ విచారణ జరపాలని కోరుతున్నారు. రాష్ర్టపతి, ప్రధాని, హోం మంత్రులకు లేఖలు రాశారు. రాష్ర్టంలో పాలనపై టీడీపీ భయాందోళన వ్యక్తం చేస్తోంది. ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోందని ఆందోళన చెందుతోంది.
అవినీతి, అక్రమాలు, డ్రగ్స్ మాఫియా అరాచకాలపై ప్రశ్నిస్తే దాడులకు దిగడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. శాంతిభ్రదతలు గాలికొదిలేసిన వైసీపీ నైతిక ప్రవర్తన పక్కన పెట్టిందని దుయ్యబట్టింది. వైసీపీ దాడుల ఫొటోలు చూపిస్తూ ఇదేంటని అడిగారు. అధికారంలో ఉన్న పార్టీ చేస్తున్న అక్రమాలపై ఎవరు నోరుమెదపడం లేదని ఆరోపించింది.
టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులను ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రతిపక్షానికి విలువ లేకుండా పోతోందని తెలిపింది. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై కేంద్రం కూడా నిశితంగా పరిశీలిస్తుందన్నారు. డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతోందని విమర్శించింది.