CM Jagan: ఆంధ్రప్రదేశ్ లో పరిణామాలు మారుతున్నాయి. నిన్న జరిగిన దుమారంపై ఎవరికి వారు తమ గళం విప్పుతున్నారు. ప్రభుత్వమే పాడు పని చేసిందని ప్రతిపక్షం, ప్రతిపక్షమే తమను రెచ్చగొట్టిందని ప్రభుత్వం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. టీడీనీ నేత పట్టాభి చేసిన ఆరోపణలపై గొడవ రేగింది. సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారని మండిపడుతున్నారు. పరుషమైన పదజాలం వాడుతూ ప్రత్యర్థులపై ఆరోపణలు చేయడంపై రెండు పార్టీల్లో గందరగోళం ఏర్పడింది. వివాదం కాస్త ముదిరి తారాస్థాయికి చేరింది.

దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ టీడీపీ దారి తప్పి ప్రవర్తిస్తోందని ధ్వజమెత్తారు. నోరు జారుతూ పదునైన పదాలు వాడుతూ ప్రభుత్వంపై విమర్శలకు దిగడం దారుణమని అన్నారు. దీంతో ప్రభుత్వం టీడీపీని కట్టడి చేసే క్రమంలో జరిగిన పరిణామాలను అది క్యాష్ చేసుకుంటుందని వివరణ ఇచ్చారు. సీఎం, డీజీపీపై కూడా తమదైన శైలిలో టీడీపీ ఆరోపణలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. టీడీపీ ధోరణిలో మార్పు వచ్చిందని ధ్వజమెత్తారు.
సీఎ జగన్ తల్లిని తిడితే ఎవరు ఊరుకుంటారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాప్రతినిధులకు కూడా విలువ లేకుండా పోతోందని దుయ్యబట్టారు. సీఎం అయినా ప్రతిపక్షాల ముందు అంత లోకువా అని అన్నారు. పరువు ప్రతిష్టలకు ప్రాణం ఇచ్చే ప్రభుత్వంలో ప్రతిపక్షం ఇంత దారుణంగా మాట్లాడితే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడేది లేదని చెప్పారు. అందుకే ప్రతిపక్షాన్ని అదుపులో పెట్టడానికి ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రభుత్వానికి దక్కుతున్న విజయాలతో ప్రతిపక్షానికి మింగుడుపడటం లేదని అన్నారు. అందుకే ప్రతిపక్షం నోరు జారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. దీంతో దాన్ని అణచడం మా బాధ్యతగా అభివర్ణించారు. ప్రజల కోసం ప్రభుత్వం పనిచేస్తుంటే ప్రతిపక్షం అడ్డుకుంటుందని తెలిపారు. దీనిపై ప్రతిపక్షం తీరును ఎండగట్టారు.