Coronavirus: కరోనా మరోమారు రెక్కలు విప్పుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రమాదఘంటికలు మోగిస్తోంది. మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇంగ్లండ్ లో 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. డెల్టా ఉత్పరివర్తనంలో ఏవై 4.2 రకం కేసులు పెరుగుతూ అందరిని ఆందోళనకు గురి చేస్తోంది. 15 శాతం అధిక వేగంతో వ్యాప్తి చెందుతూ రష్యాలో రోజుకు 33 వేల కేసులు నమోదవుతున్నాయి. వెయ్యి మరణాలు సంభవిస్తున్నాయి.

దేశ జనాభాలో 29 శాతం మందికి రెండు టీకా డోసులు వేసినా ఆంక్షలు లేకపోవడంతో మాస్కో, సెయింట్ పీటర్స్ బర్గ్ వంటి నగరాల్లో ప్రజలు నిబంధనలు పాటించడం లేదు. దేశవ్యాప్తంగా కొవిడ్ తో 4.18 లక్షల మది మృత్యువాత పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్ ఆంక్షలు విధించాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఆస్రేలియాలో డెల్టా ఉత్పరివర్తనంతో వ్యాధి ముదురుతోందని తెలుస్తోంది.
అగ్రరాజ్యం అమెరికాలో కూడా కొవిడ్ జడలు విప్పుతోంది. ఇప్పటికి 7.28 లక్షల మది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం అమెరికాలో రోజుకు 90 వేల కేసులు నమోదవుతున్నాయి. మూడొంతులకు పైగా బాధితులు ఆప్పత్రుల్లో చేరుతున్నారు. ఐసీయూల భారం పెరుగుతోంది. వ్యాక్సినేషన్ వేగంగా పూర్తవుతున్నా వ్యాధి తీవ్రత కూడా అంతే స్థాయిలో పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
అమెరికాలో అదుపు తప్పుతున్న పరిస్థితులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రజలు నిబంధనలు పాటించకపోవడంతోనే కొవిడ్ మహమ్మారి విజృంభిస్తోందని తెలుస్తోంది. 94 కోట్ల వయోజనుల్లో సుమారు 30 కోట్ల మందికే రెండు డోసుల టీకాలు వేశారు. దీంతో వ్యాధి తీవ్రత ముదురుతోందని సమాచారం. ఏది ఏమైనా కరోనా మహమ్మారి మరోమారు ప్రపంచాన్ని వణికించేందుకు రెడీ అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.