ఎట్టకేలకు బీజేపీతో ‘మాట’ కలిసిన బాబు..!

కరోనా పుణ్యమా.. అని బాబు సాధించాడు.. కిందటి ఎన్నికల నుంచి బీజేపీ, టీడీపీ ఎడమొఖం పెడముఖంగా ఉంటున్నాయి. టీడీపీ చంద్రబాబు నాయుడు కేంద్రంలో కాంగ్రెస్ రాబోతుందని ఊహించి బీజేపీ కూటమికి వ్యతిరేకంగా నడుచుకున్నారు. కాంగ్రెస్ కూటమిలో చేరి ముందుండి నడిపించారు. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి దారుణ పరాజయం పాలవడంతోపాటు రాష్ట్రంలోనూ టీడీపీ అధికారానికి దూరమైంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో ఎందుకైనా మంచిదని ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. నాటి నుంచి […]

Written By: NARESH, Updated On : September 3, 2020 11:53 am
Follow us on

కరోనా పుణ్యమా.. అని బాబు సాధించాడు.. కిందటి ఎన్నికల నుంచి బీజేపీ, టీడీపీ ఎడమొఖం పెడముఖంగా ఉంటున్నాయి. టీడీపీ చంద్రబాబు నాయుడు కేంద్రంలో కాంగ్రెస్ రాబోతుందని ఊహించి బీజేపీ కూటమికి వ్యతిరేకంగా నడుచుకున్నారు. కాంగ్రెస్ కూటమిలో చేరి ముందుండి నడిపించారు. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి దారుణ పరాజయం పాలవడంతోపాటు రాష్ట్రంలోనూ టీడీపీ అధికారానికి దూరమైంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో ఎందుకైనా మంచిదని ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు.

నాటి నుంచి చంద్రబాబు నాయుడు బీజేపీతో మళ్లీ స్నేహగీతం పాడేందుకు యత్నిస్తున్నారు. అయితే బీజేపీ మాత్రం ఆయనను దూరం పెడుతూ వస్తోంది. బాబు అవకాశ రాజకీయాలను అర్థం చేసుకున్న బీజేపీ ఏపీలో సొంతంగానే బలపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అంటే గిట్టని సోము వీర్రాజుకు ఏపీ బీజేపీ అధ్యక్ష కట్టబెట్టింది. దీంతో బీజేపీలో బాబుకు కోవర్టులుగా వ్యవహరిస్తున్న వారిపై వీర్రాజు సస్పెన్షన్ వేటుతో హడలెత్తించారు. దీంతో బీజేపీకి దగ్గరికి కావాలని అనుకున్న బాబు ఆశలు గల్లంతయ్యాయి.

బీజేపీ, టీడీపీ మధ్య చాలాదూరం పెరిగిపోతున్న సమయంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కరోనా బారినపడ్డారు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నారు. ఈనేపథ్యంలో చంద్రబాబు బుధవారం అమిత్ షాతో ఫోన్లో మాట్లాడి ఆయన క్షేమసమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య పలు రాజకీయ విషయాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే గతేడాది కాలంగా బాబు ప్రధాని మోదీ, అమిత్ షాలతో మాట్లాడేందుకు అపాయింట్మెంట్ కోరినా వారి నుంచి రెస్పాన్స్ రాలేదు. అయితే కరోనా పుణ్యమా అని బాబుకు అమిత్ షాతో మాట్లాడే అవకాశం దక్కింది. దీంతో బీజేపీతో పొత్తు ఆశలు మళ్లీ బాబులో చిగురించినట్లు తెలుస్తోంది. కరోనాను కూడా రాజకీయంగా వాడుకోవడం బాబుకే సాధ్యమని కామెంట్లు విన్పిస్తున్నాయి.