ఒకవైపు చర్చలు అంటూనే.. మరో వైపు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమైంది. ఇప్పటికే చైనాకు షాకుల మీద షాకులు ఇస్తున్నా మన సైన్యాన్ని రెచ్చగొడుతూనే ఉంది. అంతకుమించి మన భూభాగాన్ని ఆక్రమించింది. రెండు కొండలను కైవసం చేసుకుంది. దీనికి దీటుగా భారత్ కూడా చైనా భూ భాగాన్ని ఆక్రమించి సమాధానం ఇచ్చింది. అయినా.. తన వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు. ఇక చైనా సైన్యంతో పోరాడేందుకు భారత్ డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. ఇందులోభాగంగా భారత్ టుటు రెజిమంట్‌ను రంగంలోకి దించుతోంది. ఇంటెలిజెన్స్ రెజిమెంట్‌గా గుర్తింపు పొందిన ఈ దళం.. సైన్యాధికారికి బదులు రా ద్వారా నేరుగా ప్రధానమంత్రికి నివేదిస్తుంది.
ఆగస్టు 29 రాత్రి చైనా సైన్యం మళ్లీ లడఖ్‌లోకి చొరబడేందుకు ప్రయత్నం చేసింది. చైనా సైన్యంతో పోరాడిన ఓ యువ జవాను అమరుడయ్యాడని బుధవారం వార్తలు వచ్చాయి. టిబెటన్ మూలాలున్న ఈ జవాన్ టుటు రెజిమెంట్ దళాలకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. 2018 అక్టోబర్‌లో యూరోపియన్ దేశం ఎస్టోనియాకు చెందిన ప్రసిద్ధ గాయని యానా కాస్క్ మన దేశానికి వచ్చి తన మ్యూజిక్ వీడియో షూట్ చేయాలనుకుంది. ఇందుకు ఆమె ఉత్తరాఖండ్‌లోని చక్రత ప్రాంతాన్ని ఎంచుకున్నారు. చక్రత డెహ్రాడూన్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదొక అందమైన కొండ ప్రాంతం. షూటింగ్ చేస్తుండగా.. స్థానిక ఇంటెలిజెన్స్ యూనిట్ వెంటనే యానా, ఆమె ఫ్రెండ్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. దేశం విడిచి వెళ్లాలని నోటీసులు జారీ చేశారు.
చక్రత నిషేధిత ప్రాంతం కాబట్టి ఇదంతా జరిగింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పర్మిషన్ లేకుండా ఇక్కడికి ఏ విదేశీయుడిని అనుమతించరు. విదేశీయులు ఇక్కడికి రావడాన్ని అడ్డుకోవడానికి ప్రధాన కారణం భారత సైన్యం యొక్క అత్యంత రహస్యమైన టుటు రెజిమెంట్ ఉండేది ఇక్కడే. టుటు రెజిమెంట్ అనేది భారత సైనిక బలం. దీని గురించి బహిరంగంగా ఎవరికీ పెద్దగా తెలియదు. ఈ రెజిమెంట్ చాలా రహస్యంగా పనిచేస్తుంది. దాని ఉనికికి కూడా ఎలాంటి ఆధారాలు లేవు.
టుటు రెజిమెంట్ 1962 సంవత్సరంలో స్థాపించబడింది. అదే సమయంలో భారత్–చైనా మధ్య యుద్ధం జరిగింది. అప్పటి నుంచి ఐబీ చీఫ్ బోలానాథ్ మాలిక్ సూచన మేరకు అప్పటి ప్రధాన జవహర్‌లాల్ నెహ్రూ టుటు రెజిమెంట్ ఏర్పాటుకు నిర్ణయించారు. చైనా సరిహద్దులోకి ప్రవేశించి లడఖ్ యొక్క క్లిష్టమైన భైగోళిక పరిస్థితులలో పోరాడగల యోధులను సిద్ధం చేయడమే ఈ రెజిమెంట్ ప్రధాన ఉద్దేశం. టిబెట్ నుంచి శరణార్థులుగా వచ్చిన యువతనే ఈ పనికి తీసుకుంటారు. వీరితైనే రాళ్లలో నడవడం.. పర్వతాలు అధిరోహించడం.. పరిగెత్తడం వీరికే సాధ్యం. అందుకే టిబెటన్ యువకులను నియమించడానికి టుటు రెజిమెంట్‌ను నియమించారు. రిటైర్డ్ మేజర్ జనరల్ సుజన్ సింగ్ ఈ రెజిమెంట్‌కు మొదటి ఐజీగా పనిచేశారు. రెండో ప్రపంచ యుద్ధం టైంలో 22వ మౌంటైన్ రెజిమెంట్‌కు సుజన్ సింగ్ నాయకత్వం వహించారు.