Gopalapatnam : పిల్లల అల్లరికి బెదిరించడానికి ఉరి వేసుకున్నాడు.. బిగిసుకొని చనిపోయాడు.. ట్రాజెడీ మరణం

బీహార్ కు చెందిన చందన్ కుమార్ రైల్వేలో సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్ గా పనిచేస్తున్నాడు. గత ఐదు సంవత్సరాలుగా గోపాలపట్నం పరిధిలోని కొత్తపాలెం లో నివాసం ఉంటున్నాడు. ఆయనకు భార్య, ఏడేళ్ల కుమార్తె, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. బుధవారం ఆయన జేబులో కరెన్సీ నోట్లను తీసి పిల్లలు చించేశారు. దీంతో పిల్లలపై చిరాకుపడ్డాడు చందన్. భార్య అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమెపై చిరాకు పడ్డాడు

Written By: Dharma, Updated On : July 19, 2024 10:37 am
Follow us on

Gopalapatnam ; ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న తప్పిదాలు భారీ మూల్యాన్ని చెల్లించుకుంటాయి. సున్నితత్వంతో చేసే చిన్న చిన్న పనులు ప్రాణాలు మీదకు తెస్తాయి. ఏమరపాటుగా చేసే ప్రయత్నాలు వికటిస్తాయి. అటువంటి ఘటనే విశాఖలో వెలుగు చూసింది.’ మీరు అల్లరి చేస్తే నేను చచ్చిపోతా’ అంటూ పిల్లల అల్లరిని మాన్పించడానికి ఓ తండ్రి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో భాగంగా తనువు చాలించాడు.

బీహార్ కు చెందిన చందన్ కుమార్ రైల్వేలో సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్ గా పనిచేస్తున్నాడు. గత ఐదు సంవత్సరాలుగా గోపాలపట్నం పరిధిలోని కొత్తపాలెం లో నివాసం ఉంటున్నాడు. ఆయనకు భార్య, ఏడేళ్ల కుమార్తె, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. బుధవారం ఆయన జేబులో కరెన్సీ నోట్లను తీసి పిల్లలు చించేశారు. దీంతో పిల్లలపై చిరాకుపడ్డాడు చందన్. భార్య అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమెపై చిరాకు పడ్డాడు. వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.చిన్నపాటి ఘర్షణ రేగింది. దీంతో చందన్ కుమార్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.

పిల్లలను లైన్ లో పెట్టేందుకు చందన్ కుమార్ చిన్నపాటి ప్రయత్నం చేశాడు. మీరు ఇలానే అల్లరి చేస్తే నేను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అంతటితో ఆగకుండా ఇంట్లో ఫ్యాన్ కు చీర కట్టి.. దానిని మేడకు చుట్టుకున్నాడు. కుటుంబ సభ్యులను భయపెట్టే ప్రయత్నం చేశాడు.ఇంతలో పొరపాటున చీర మెడకు బిగుసుకుపోయింది.దీంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు.భార్య వెంటనే కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

గత కొన్నేళ్లుగా చందన్ కుమార్ స్థానికంగా నివాసము ఉండడంతో అందరికీ సుపరిచితుడయ్యాడు. అందరితో కలివిడిగా ఉండేవాడు. దీంతో స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కళ్లెదుటే భర్త చనిపోయేసరికి భార్య రోధన అంతా ఇంతా కాదు. పిల్లలు సైతం ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. గోపాలపట్నం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు.