https://oktelugu.com/

YCP: వారు ఇరుక్కున్నారు.. సజ్జల ఎస్కేప్.. వాట్ ఏ ప్లాన్!

రాష్ట్రవ్యాప్తంగా కేసులు, అరెస్టుల పర్వం కొనసాగుతోంది. కానీ వాటికి కారణమైన నాయకుడు మాత్రం పరారయ్యాడు. కిందిస్థాయి ప్రతినిధులు మాత్రం బలయ్యారు.

Written By:
  • Dharma
  • , Updated On : November 12, 2024 11:12 am
    YCP

    YCP

    Follow us on

    YCP: ఏపీవ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులపై కేసులు నమోదవుతున్నాయి. అప్పట్లో అధికార మదంతో రాజకీయ ప్రత్యర్థులను సోషల్ మీడియాలో వెంటాడారు. వేటాడినంత పని చేశారు. గత ఐదు నెలలుగా అదే సంస్కృతిని కొనసాగిస్తున్నారు.ఇప్పుడు ఏపీ పోలీసులు ఉక్కు పాదం మోపడంతో కకావికలం అవుతున్నారు. సైబర్ నేరాలకు సంబంధించి కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఈ తరుణంలో పార్టీ హై కమాండ్ స్పందించింది. లీగల్ టీం భరోసా ఇస్తోంది. అరెస్టులపై సత్వరం స్పందిస్తోంది. మరోవైపు ఆ పార్టీకి చెందిన దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డ అంజిరెడ్డి, ఎమ్మెల్సీ రాహుల్లా, వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులు పోలీస్ కమిషనరేట్ లో ఫిర్యాదు చేశారు. అయితే రాష్ట్రంలో ఎంత అలజడి జరుగుతున్న సోషల్ మీడియా విభాగం ఇంచార్జ్ సజ్జల భార్గవ రెడ్డి మాత్రం ఇంతవరకు కనిపించకపోవడం విశేషం.

    * సాయి రెడ్డిని సైడ్ చేసి
    2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అప్పటివరకు పార్టీలో నెంబర్ టు గా విజయసాయిరెడ్డి ఉండేవారు. కానీ సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నఫలంగా ఎంటరయ్యారు. ముఖ్యమంత్రి జగన్ కు సలహాదారుడిగా మారారు. పార్టీ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. క్రమేపి పార్టీతో పాటు ప్రభుత్వాన్ని ఆక్రమించేశారు. అటు తరువాత కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డిని ఎంటర్ చేశారు. పార్టీలో కీలకమైన సోషల్ మీడియా విభాగం బాధ్యతలు అప్పగించారు. గత ఐదేళ్లుగా వందలాది మంది ప్రతినిధులను ఏర్పాటు చేసుకొని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరించారు సజ్జల భార్గవ్ రెడ్డి. కానీ ఇప్పుడు అదే ప్రతినిధులు అరెస్ట్ అయ్యారు. కేసుల్లో ఇరుక్కున్నారు. కానీ వారికి నాయకుడిగా ఉన్న సజ్జల మాత్రం సేఫ్ జోన్ లో ఉన్నారు.

    * అజ్ఞాతంలోకి భార్గవ్ రెడ్డి
    వాస్తవానికి ఎన్నికల ఫలితాలు అనంతరం సజ్జల భార్గవ్ రెడ్డి కనిపించకుండా పోయారు. అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే ఇదంతా సజ్జల రామకృష్ణారెడ్డి ముందస్తు వ్యూహం అని తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధుల పై కేసులు నమోదయ్యాయి. అరెస్టులు కూడా జరిగాయి. వారిలో ఒక రకమైన అసంతృప్తి కనిపిస్తోంది. అనవసరంగా భవిష్యత్ నాశనం చేసుకున్నామన్న బెంగ వెంటాడుతోంది. ఒకరిద్దరూ దీనిపై అభిప్రాయాలు కూడా వ్యక్తం చేశారు. తాము ఎంతో నష్టపోయామని.. యువత ఈ రాజకీయ పార్టీల బారిన పడవద్దని ఒకరిద్దరు విజ్ఞప్తి కూడా చేశారు. ముఖ్యంగా తమకు నాయకత్వం వహించిన సజ్జల భార్గవ్ రెడ్డి కనిపించకపోవడంతో ఒక రకమైన ఆవేదన వారిలో కనిపిస్తోంది.