AP Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడింది.అల్పపీడనంగా మారింది.ఫలితంగాఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.కొద్దిరోజుల కిందట ఈ ఆవర్తనం ఏర్పడింది.ఇప్పుడు అల్పపీడనంగా మారింది.సముద్ర తలం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఇది విస్తరించి ఉంది.ఇది క్రమేపి తమిళనాడు దక్షిణ తీర ప్రాంతం, పుదుచ్చేరి, శ్రీలంక వైపు కదులుతోంది. దీని ప్రభావంతో నేటి నుంచి వర్షాలు కొరవనున్నాయి. ముఖ్యంగా యానాం, ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అనంతపురం, సత్యసాయి పుట్టపర్తి జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు కావచ్చు. ఉత్తర కాస్తాలో సైతం చిన్నపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
* ఈరోజు ఈ ప్రాంతాల్లో వర్షం
ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈరోజు నెల్లూరు,శ్రీ సత్యసాయి పుట్టపర్తి,కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. విశాఖ, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణ, బాపట్ల, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఈ తుఫాను ప్రధానంగా తమిళనాడుపై ప్రభావం చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
* ఏపీవ్యాప్తంగా చల్లటి గాలులు
అయితే ఇప్పటికే ఏపీవ్యాప్తంగా చల్లటి గాలులు వీస్తున్నాయి. ఖరీఫ్ లో భాగంగా ప్రస్తుతం వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో తుఫాన్ ప్రభావం కనిపిస్తుండడంతో రైతుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. మరోవైపు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు సైతం వేటకు దూరమవుతున్నారు. ఉపాధి కోల్పోతున్నారు.