https://oktelugu.com/

Emotional Touch Movie: తండ్రి, కొడుకుల బంధాన్ని తెలిపే ఎమోషనల్ టచ్ మూవీ.. OTTలో స్ట్రీమింగ్ అప్పటి నుంచే.. 

సినీ ప్రేక్షకులు థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమాల కంటే OTT లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది కలిసి చూసేందుకు OTT అనుగుణంగా ఉండడంతో  ఈ ప్లాట్ ఫాం పై Release అయ్యే సినిమాలపై ఆసక్తి పెరుగుతోంది. థియేటర్లలో సక్సెస్ కానీ ఎన్నో సినిమాలు OTTలో అద్భుత విజయాలు సాధించాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : November 12, 2024 / 11:18 AM IST

    Ma-Nanna

    Follow us on

    Emotional Touch Movie: సినీ ప్రేక్షకులు థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమాల కంటే OTT లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది కలిసి చూసేందుకు OTT అనుగుణంగా ఉండడంతో  ఈ ప్లాట్ ఫాం పై Release అయ్యే సినిమాలపై ఆసక్తి పెరుగుతోంది. థియేటర్లలో సక్సెస్ కానీ ఎన్నో సినిమాలు OTTలో అద్భుత విజయాలు సాధించాయి. ఈ నేపథ్యంలో దర్శక నిర్మాతలు సైతం OTT ప్లాట్ ఫాంపై ఆసక్తి చూపుతున్నారు. ఈ తరుణంలో  సుధీర్ బాబు నటించిన ఎమోషనల్ టచ్ మూవీ త్వరలో ఓటీటీ వేదికపైకి రాబోతుంది. తండ్రి కొడుకుల మధ్య బంధాన్ని తెలిపై ఈ మూవీ ఇప్పటికే థియేటరల్లో విడుదలయి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఇప్పుడుOTT ప్లాట్ ఫాం పై  కూడా ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంటుందంటే?
    సుధీర్ బాబు, షియాజీ షిండే, సాయిచంద్ లు కలిసి నటించిన మూవీ ‘మా నాన్న సూపర్ హీరో’. ఈ మూవీ అక్టోబర్ 11న థియేటర్లలో రిలీజ్ అయింది. తండ్రి కొడుకుల మధ్య సాగే ఈ ఎమోషనల్ డ్రామాపై మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు OTT ప్లాట్ ఫాంపై నవంబర్ 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ కథ చాలా ఆసక్తిగా ఉండడంతో ఈ మూవీ ఓటీటీ ప్లాట్ ఫాంపై ఆకట్టుకుంటుందని డైరెక్టర్ అభిలాష్ రెడ్డి కంకర ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
    ‘మా నాన్న సూపర్ హీరో’ కథ ఆసక్తిగా ఉంటుంది. ఇందులో జానీ క్యారెక్టర్ ను సుధీర్ బాబు పోషించారు. జానీ కన్నతండ్రి ప్రకాశ్(సాయి చంద్ ) అయితే పెంపుడు తండ్రి పాత్రలో షియాజీ షిండే పోషించారు. జానీ తన పెంపెడు తండ్రి వద్దే ఎక్కువ కాలం ఉంటాడు. ఈ క్రమంలో తండ్రి చేసిన అప్పులను తీర్చడానికి కష్టపడుతాడు. ఈ క్రమంలో రూ. కోటి  వరకు సేకరిస్తారు. అయితే ఈ డబ్బును సేకరించడానికి జానీ ఏం చేశాడు? ఈ సమయంలో తన సొంత తండ్రి తో కలిసి జానీ చేసిన ప్రయాణం ఎలా ఉంటుంది? ఇలా తండ్రి కొడుకుల బంధాన్న తెలియజేసే ఈ చిత్రం ఆసక్తిగా సాగుతుంది.
    ప్రముఖ OTT సంస్థ Zee5లో నవంబర్ 15 నుంచి రన్ కానుంది. ఇప్పటి వరకు కుటుంబ కథా చిత్రాలు చాలా ఆసక్తిగా సాగాయి. బలగం వంటి సినిమాలు ఎంతో సందడి చేశాయి. అలాగే మా నాన్న సూపర్ హీరో మూవీ సైతం ఎమోషనల్ డ్రామాగా ఆకట్టుకుంటుంది.  గతంలో ‘లూజర్’ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన అభిలాష్ రెడ్డి కంకర ‘మా నాన్న సూపర్ హీరో’ సినిమాతో మరింత చేరువయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘తండ్రి ప్రేమే కొడుకు బలానికి పునాది’ అనే కాన్సెప్టులో ఈ మూవీని తీశామని, సుధీర్ బాబుతో  ఇతర నటుల పర్ఫామెన్స్ తో సినిమా అద్భుతంగా వచ్చిందని పేర్కొన్నారు. ఇప్పుడు ఓటీటీలో కూడా మా నాన్న సూపర్ హీరో సినిమా సక్సెస్ అవుతుందని అన్నారు.