New district in AP: ఏపీలో( Andhra Pradesh) మరో కొత్త జిల్లా ఏర్పాటు కాబోతోంది. ఈ మేరకు కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు స్వయంగా మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు. దీంతో సన్నాహాలు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలను ప్రకటించిన సమయంలో మార్కాపురం తెరపైకి వచ్చింది. మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయాలని అప్పట్లో ఆ ప్రాంతీయులు కోరారు. కానీ వైసీపీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ సానుకూల నిర్ణయం తీసుకోవడం విశేషం.
చంద్రబాబు హామీ మేరకు..
2024 ఎన్నికల సమయంలో మార్కాపురం( Markapuram) కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. మార్కాపురం ప్రాంతంలో ఎన్నికల ప్రచార సమయంలో సైతం హామీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పలు సందర్భాల్లో కొత్త జిల్లా ఏర్పాటు అంశం ప్రస్తావనకు వచ్చింది కూడా. గతంలోనే చాలాసార్లు ఇదే విషయంపై మంత్రులు ప్రకటనలు చేశారు. అయితే జాప్యం జరుగుతుండడం పై ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి కనిపిస్తోంది. ఇదే విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: నిరుద్యోగులకు అలెర్ట్ : మెగా డీఎస్సీ 2025 పై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
ఆ ఐదు నియోజకవర్గాలను కలుపుతూ..
ప్రకాశం జిల్లాలోని( Prakasam district ) మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాలను కలుపుతూ కొత్త జిల్లా ఏర్పాటుకు సంబంధించి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు. ప్రకాశం జిల్లాలో జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా రూ. 1290 కోట్లతో తాగునీటి ప్రాజెక్టుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. మార్కాపురంలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన పవన్ కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి, దర్శి, కొండపి, కందుకూరు నియోజకవర్గాల పరిధిలోని 31 మండలాల్లోని 1383 గ్రామాలకు పాగునీటి సమస్య తీరనుంది. ఇదే వేదికపై మంత్రి మార్కాపురం ప్రత్యేక జిల్లా ఏర్పాటుకు సంబంధించి ప్రకటన చేశారు. దీంతో అతి త్వరలో కొత్త జిల్లా ఏర్పాటు అంశం అమలు కానుందన్నమాట.
Also Read: హైదరాబాద్ టు విశాఖ వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అదనంగా ఈ సౌకర్యం..
ప్రాంతాలకు అనుగుణంగా..
అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు( CM Chandrababu) ప్రాంతాలకు అనుగుణంగా చాలా రకాల హామీలు ఇచ్చారు. అప్పట్లో ప్రత్యేక జిల్లాల ప్రస్తావన తీసుకొచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా జిల్లాల విభజన చేపట్టిందని విమర్శించారు. అందుకే పారదర్శకంగా మరోసారి విభజన చేపడుతామని.. కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వాటి అమలుపై దృష్టి పెట్టారు.