Ram Gopal Varma: శివ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ…ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఓవర్ నైట్ లో స్టార్ట్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు సెన్సేషనల్ డైరెక్టర్ గా గొప్ప గుర్తింపునైతే సంపాదించుకున్నాడు. ఆయన గత కొద్ది రోజుల నుంచి తనకి ఇష్టం వచ్చిన సినిమాలను చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అలాగే రామ్ గోపాల్ వర్మ కెరియర్ మొదటి నుంచి కూడా తనకు నచ్చింది మాట్లాడుతూనే వచ్చాడు. తనకి నచ్చినవారిపైన విమర్శలు చేస్తూనే ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన రాసిన ‘నా ఇష్టం’ లాంటి బుక్ తో తన ఐడియాలజీని జనాల మీద రుద్దే ప్రయత్నం చేశాడు. ఇక అది కాకుండా రాముయిజం అంటూ కొన్ని ఇంటర్వ్యూలను ఇస్తూ అందరి మనోభావాలను దెబ్బతినేలా మాట్లాడుతూ ఉండేవారు. కానీ రీసెంట్ టైంలో ఆయన మారినట్టుగా తెలుస్తోంది. రీసెంట్ గా శివ సినిమా సమయంలో చిరంజీవి ఆ సినిమాను అందరూ చూడండి అని చెప్పడంతో చిరంజీవి మీద తను గతంలో చేసిన విమర్శలను ఖండిస్తూ చిరంజీవికి సారి కూడా చెప్పాడు… రామ్ చరణ్ చేసిన చికిరి చికిరి సాంగ్ అద్భుతంగా ఉందంటూ కొనియాడాడు అలాగే రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ‘ వారణాసి’ వస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఇక ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ మీద వర్మ స్పందిస్తూ ఈ మూవీ విజువల్ వండర్ గా రాబోతోంది అంటూ ఆయన మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇవే కాకుండా ‘దురంధర్’ లాంటి సినిమా సైతం ప్రేక్షకులను అలరించింది. ఇండియాలో మరిన్ని ఇలాంటి సినిమాలు రావాలని బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేయాలని ఆయన చెప్పిన మాటలు చూసిన ప్రతి ఒక్కరు వర్మ కి ఏమైంది అంటూ ట్వీట్ చేశారు.
ఇదంతా చూస్తున్న రాంగోపాల్ వర్మ అభిమానులు సంతోషపడుతున్నారు. ఎందుకంటే వర్మ గతం లో చాలామంది స్టార్ హీరోలను ఉద్దేశిస్తూ విమర్శలు చేసేవాడు. దానివల్ల ఆయా హీరోల అభిమానులు వర్మ పైన విమర్శలు చేయడమే కాకుండా అతను ఎక్కడైనా కనిపిస్తే కొట్టాలి అనేంత కోపంతో ఉండిపోయేవారు.
కానీ ఇప్పుడు మాత్రం ఆయన వాటన్నింటికి చెక్ పెడుతూ ఆలోచిస్తూ మాట్లాడుతుండడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.రాంగోపాల్ వర్మ ఇక మీదట కూడా ఇలానే ఉంటూ అందరి తో స్నేహ పూర్వకంగా ఉంటాడా? ఎవ్వరిని డిస్ట్రబ్ చేయకుండా తన సినిమాలను తను చేసుకుంటూ ముందుకు సాగుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…