Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇంతింతై వటుడింతై అనే రేంజ్ లో దీని అభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఉన్న దర్శకులందరు పాన్ ఇండియా పరిధిని దాటి పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులందరు ఇండియా వైడ్ గా తమ సత్తా చాటుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే రాజమౌళి బాహుబలి సినిమాతో ఎలాగైతే పాన్ ఇండియాలో తెలుగు సినిమా ఇండస్ట్రీని పరిచయం చేశాడో, ఇప్పుడు మరోసారి మహేష్ బాబుతో చేస్తున్న వారణాసి సినిమా ద్వారా ప్రపంచానికి తెలుగు సినిమా స్టాండర్డ్స్ ఏంటో రుచి చూపించాలని చూస్తున్నాడు.
ఈ సినిమా 1300 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇక అన్ని అనుకున్నట్టుగా వర్కౌట్ అయితే మాత్రం ఈ మూవీ 3000 కోట్ల రూపాయల కలెక్షన్స్ ను కొల్లగొట్టే అవకాశాలైతే ఉన్నాయి అంటూ సగటు సినిమా ప్రేక్షకులు అందరూ వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
హాలీవుడ్ సినిమాకి పోటీని ఇచ్చే స్థాయికి మన టాలీవుడ్ ఇండస్ట్రీ ఎదగబోతోంది. రాబోయే 5 నుంచి 10 సంవత్సరాల సమయంలో ఇండియన్ సినిమా ఇండస్ట్రీతో పాటు హాలీవుడ్ ఇండస్ట్రీ కి సైతం గట్టి పోటీని ఇచ్చే స్థాయికి మన ఇండస్ట్రీ ఎదుగుతుందనేది వాస్తవం… ఇక రాబోయే కొద్ది రోజుల్లోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ 15 వేల కోట్ల కలెక్షన్స్ ని కూడా కొల్లగొడుతోంది అంటూ కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని బాలీవుడ్ వాళ్లు సైతం లెక్కచేయలేదు. కానీ ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ వల్ల ఇండియన్ సినిమా స్టామినా పెరిగింది. మన మార్కెట్ కూడా విపరీతంగా పెరిగింది. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు ఇండియన్ సినిమా వైపు ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు చూసే రోజులైతే వచ్చాయి. ఇక ముందు ముందు మరిన్ని సక్సెస్ లను సాధిస్తూ మన మేకర్స్ గొప్ప విజయాలను అందుకుంటారా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.