Pawan Kalyan: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కెరీర్ లోనే కాదు, టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిల్చిన చిత్రం ‘ఓజీ'(They Call Him OG). ఈ సినిమా మొదలు అయినప్పటి నుండి, విడుదల అయ్యేంత వరకు ఆడియన్స్ లో క్రియేట్ చేసిన హైప్, క్రేజ్, యుఫోరియా ఈమధ్య కాలంలో ఏ సినిమా కూడా చేయలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక అభిమానులకు అయితే ‘ఓజీ’ అనే చిత్రం ఒక ఎమోషన్. ఈ ఎమోషన్ కేవలం ‘ఓజీ’ తోనే ఆగిపోవాలని అభిమానులకు లేదు, డైరెక్టర్ సుజిత్ కి అసలు లేదు. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని, ప్రీక్వెల్ కూడా ఉంటుందని అటు డైరెక్టర్ సుజిత్, ఇటు హీరో పవన్ కళ్యాణ్ అభిమానులకు క్లారిటీ ఇచ్చారు. కానీ ఎప్పుడు మొదలు అవుతుంది అనే విషయం పై అయితే స్పష్టమైన ప్రకటన రాలేదు. ఓజీ చిత్రం విడుదలైన వెంటనే, డైరెక్టర్ సుజిత్ నాని తో ఒక సినిమాని ప్రారంభించాడు.
రెగ్యులర్ షూటింగ్ ఈ నెల నుండే మొదలు అన్నారు కానీ, ఇప్పట్లో ఈ సినిమా మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు. అయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ సుజిత్ ని పిలిచి ఓజీ మూవీ ప్రీక్వెల్ కి కథ రెడీ చేసుకో, డేట్స్ ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వడానికి రెడీ అని చెప్పాడట. దీంతో నాని సినిమా కంటే ముందు ‘ఓజీ 2’ చెయ్యాలని డైరెక్టర్ సుజిత్ ఫిక్స్ అయిపోయాడట. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసినట్టు తెలుస్తోంది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ సుజిత్ కి డిఫెండర్ కార్ ని గిఫ్ట్ గా ఇచ్చేటప్పుడు ఆయన లుక్స్ ని మీరంతా చూసే ఉంటారు. ఇది ఓజీ సీక్వెల్ కి సంబంధించిన లుక్స్ అట. ఈమధ్యనే లుక్ టెస్ట్ నిర్వహించినట్టు తెలుస్తోంది. అందుకే పవన్ ఆ హెయిర్ స్టైల్ ని మైంటైన్ చేస్తున్నట్టు సమాచారం.
ఇదంత పక్కన పెడితే ‘ఓజీ 2’ డీవీవీ ఎంటెర్టైన్మెట్స్ బ్యానర్ లో తెరకెక్కడం లేదు. ‘ఓజీ’ సినిమా షూటింగ్ పూర్తి అవుతున్న సమయంలో నిర్మాత దానయ్య కి, సుజిత్ కి మధ్య చిన్నపాటి మనస్పర్థలు ఏర్పడ్డాయట. ఇక మీదట మీ బ్యానర్ లో సినిమా చేసే అవకాశమే లేదని ఆయన దానయ్య తో చెప్పినట్టు తెలుస్తోంది. అందుకే నాని సినిమా కూడా DVV ప్రొడక్షన్ హౌస్ నుండి తప్పించారు. లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ఏమిటంటే ‘ఓజీ 2’ చిత్రాన్ని ఇప్పుడు యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించబోతున్నారట. ప్రభాస్ కూడా సహనిర్మాతగా వ్యవహరిస్తాడని టాక్. న్యూ ఇయర్ సందర్భంగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. యూవీ క్రియేషన్స్ అంటే సుజిత్ కి హోమ్ బ్యానర్ లాంటిది. బడ్జెట్ విషయం లో ఆయనకు పూర్తి స్థాయి స్వేచ్ఛ దొరుకుతుంది. ఎలాంటి అడ్డంకులు లేకుండా షూటింగ్ చేసుకోవచ్చని సోషల్ మీడియా లో పవన్ ఫ్యాన్స్ అంటున్నారు.