https://oktelugu.com/

AP Cabinet: క్యాబినెట్ కూర్పు.. పవన్ కు డిప్యూటీ సీఎం

పవన్ కళ్యాణ్ కు దాదాపు డిప్యూటీ సీఎం పదవి ఖాయమని తేలుతోంది. 2014లో టిడిపి ప్రభుత్వంలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండేవారు. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. పవన్ కు ప్రత్యేక గౌరవం ఇవ్వాలన్న భావనతో ఒక్కరికే డిప్యూటీ సీఎం సరిపెడతారని తెలుస్తోంది.

Written By:
  • Dharma
  • , Updated On : June 11, 2024 / 09:19 AM IST

    AP Cabinet

    Follow us on

    AP Cabinet: సీఎంగా చంద్రబాబు నాలుగో సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు ఉదయం 11: 27 గంటలకు చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తారు. ఇప్పటికే మంత్రివర్గ కూర్పుపై కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం నేపథ్యంలో రకరకాల సమీకరణలు తెరపైకి వచ్చాయి. వాటన్నింటినీ పరిగణలోకి తీసుకొని మంత్రివర్గ ఎంపిక పూర్తి చేసినట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న ఎమ్మెల్యేలకు మంగళవారం సాయంత్రం చంద్రబాబు స్వయంగా ఫోన్ చేయనున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు నుంచి ఎవరెవరికి ఫోన్ కాల్స్ వస్తాయా? అన్న ఆసక్తికర చర్చ నడుస్తోంది. కూటమి ఎమ్మెల్యేలలో సైతం ఒక రకమైన ఉత్కంఠ కనిపిస్తోంది.

    పవన్ కళ్యాణ్ కు దాదాపు డిప్యూటీ సీఎం పదవి ఖాయమని తేలుతోంది. 2014లో టిడిపి ప్రభుత్వంలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండేవారు. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. పవన్ కు ప్రత్యేక గౌరవం ఇవ్వాలన్న భావనతో ఒక్కరికే డిప్యూటీ సీఎం సరిపెడతారని తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పోస్టుతో పాటు కీలక శాఖను సైతం పవన్ కు కేటాయించినట్లు సమాచారం. అయితే అది ఏ శాఖ అన్నది మాత్రం బయటపడటం లేదు. పవన్ కు ఇంకా సినిమాలు పెండింగ్లో ఉన్నందున.. ఇబ్బంది లేని శాఖను కేటాయిస్తారని తెలుస్తోంది. అయితే జనసేనకు మొత్తం నాలుగు మంత్రి పదవులు ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణ, బొమ్మిడి నాయకర్, మహిళా కోటాలో లోకం మాధవి పేర్లు వినిపిస్తున్నాయి.

    బిజెపి నుంచి కూడా విపరీతమైన పోటీ ఉంది. మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ముఖ్యంగా కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి, ఆదినారాయణ రెడ్డి ల మధ్య పోటీ విపరీతంగా ఉంది. బిజెపి కేంద్రంలో రెండు మంత్రి పదవులు టిడిపికి ఇచ్చినందున.. రాష్ట్ర మంత్రివర్గంలో ఇద్దరికి చోటు ఇవ్వాలని బిజెపి కోరినట్లు సమాచారం. అందుకు చంద్రబాబు అంగీకరించినట్లు కూడా తెలుస్తోంది. జనసేనకు నాలుగు, బిజెపికి రెండు.. మొత్తం ఆరు మంత్రి పదవులు పోతే.. మిగిలింది 16 శాఖల మంత్రులు. అటు టిడిపి నుంచి 135 మంది ఎమ్మెల్యేలు ఎన్నిక కావడం.. అందులో సీనియర్లు ఉండడంతో.. రకరకాల సమీకరణలను పరిగణలోకి తీసుకొని చంద్రబాబు మంత్రివర్గ కూర్పును పూర్తి చేసినట్లు సమాచారం.