Chandrababu: రామ్ చరణ్ సరే.. తారక్ మాటేంటి? చంద్రబాబు ప్రమాణస్వీకారానికి వస్తారా?

టిడిపి కూటమి గెలిచిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా మావయ్య చంద్రబాబు, బాబాయ్ బాలకృష్ణ, మేనత్త పురందేశ్వరి, లోకేష్, శ్రీ భరత్ లకు శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు చంద్రబాబు అరెస్టుపై కనీసం స్పందించలేదు.

Written By: Dharma, Updated On : June 11, 2024 9:14 am

Chandrababu

Follow us on

Chandrababu: చంద్రబాబు ప్రమాణస్వీకారానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు ఉదయం 11: 27 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. చంద్రబాబుతో పాటు 25 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారు. ఇప్పటికే మంత్రివర్గ కూర్పు పూర్తయింది. జనసేనకు నాలుగు, బిజెపికి రెండు మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉంది.పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం హాదాతో పాటు కీలక మంత్రిత్వ శాఖను అప్పగిస్తారని తెలుస్తోంది.ప్రమాణ స్వీకారం మహోత్సవానికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.మెగా కుటుంబం నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రానున్నట్లు సమాచారం. బాబాయ్ పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేస్తుండడంతో కార్యక్రమానికి రామ్ చరణ్ హాజరుకానున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ వస్తారా? రారా? ఆయనకు ఆహ్వానం ఉందా? లేదా? అన్నది హాట్ టాపిక్ గా మారింది.

టిడిపి కూటమి గెలిచిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా మావయ్య చంద్రబాబు, బాబాయ్ బాలకృష్ణ, మేనత్త పురందేశ్వరి, లోకేష్, శ్రీ భరత్ లకు శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు చంద్రబాబు అరెస్టుపై కనీసం స్పందించలేదు. సోషల్ మీడియా వేదికగా విచారం కూడా వ్యక్తం చేయలేదు. ఇప్పుడు టిడిపి కూటమి గెలిచిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ స్పందించడం పై టిడిపి శ్రేణులు పెద్దగా పట్టించుకోవడం లేదు. పార్టీతో పాటు అధినేత కష్టాల్లో ఉన్నప్పుడు, ఆయన భార్యపై కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా పొడి పొడిగానే స్పందించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు సమయంలో.. నందమూరి తారక రామారావు, వైయస్ రాజశేఖర్ రెడ్డి లెజెండరీ పర్సన్స్ గా పోల్చారే తప్ప.. చేసినది తప్పు అని ఖండించలేదు. ఈ పరిణామాలన్నీ జూనియర్ ఎన్టీఆర్ పై టిడిపి శ్రేణుల ఆగ్రహానికి కారణమయ్యాయి.

రామ్ చరణ్ కు తారక్ మంచి స్నేహితుడు. వీరిద్దరి స్నేహం గురించి ప్రత్యేక చెప్పనవసరం లేదు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ చంద్రబాబు ప్రమాణస్వీకారానికి హాజరుకానున్నారు. తారక్ విషయంలో తేలాల్సి ఉంది. 2014లో సైతం తారక్ చంద్రబాబు ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. ఆ ఎన్నికల్లో ప్రచారం చేయకపోయినా ఆయనకు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ ఎన్నికల్లో ప్రచారం చేయకపోయినా ప్రత్యేక ఆహ్వానం అందుతుందని అంతా భావిస్తున్నారు. కచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యేందుకు ప్రయత్నిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. ఇంతకుముందు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు తారక్ కు ఆహ్వానం అందింది. కానీ ఆ వేడుకలకు తారక్ గైర్హాజరయ్యారు. అదే వేడుకలకు హాజరైన రజినీకాంత్ ను వైసీపీ నేతలు టార్గెట్ చేసిన సంగతి తెలిసింది. కొడాలి నాని అయితే రజినీకాంత్ పై వ్యక్తిగత దూషణలకు కూడా దిగారు.ఆ వ్యాఖ్యలు చాలా వివాదాస్పదం అయ్యాయి.ప్రస్తుతం ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితులు కొడాలి నాని, వల్లభనేని వంశీ ఓడిపోయారు. మరోవైపు చూస్తే ఎన్నడు రాజకీయ అంశాలపై స్పందించని తారక్.. టిడిపి కూటమి గెలుపు పై అభినందనలు తెలిపారు. ఇప్పుడు రామ్ చరణ్ వస్తుండడంతో.. తారక్సైతం కచ్చితంగా వస్తారని ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.