Botsa Satyanarayana Health : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి బొత్స సత్యనారాయణ( Botsa satyanarayana) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినం నిర్వహించిన సంగతి తెలిసిందే. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని నిరసిస్తూ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వెన్నుపోటు దినం నిర్వహించాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా విజయనగరం జిల్లా చీపురుపల్లి లో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి బొత్స పాల్గొన్నారు. వేదికపై మాట్లాడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణను విజయనగరంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైసిపి వర్గాలు చెబుతున్నాయి.
Also Read : కలిసి ఉంటే కలదు సుఖం.. లోకేష్ పై పవన్ అలా!
* పార్టీలో చాలా యాక్టివ్ గా..
ప్రస్తుతం బొత్స సత్యనారాయణ వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో చాలా యాక్టివ్ గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తరువాత ఆయనే అన్నట్టు పరిస్థితి ఉంది. మొన్నటి ఎన్నికల్లో చీపురుపల్లి అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ టిడిపి అభ్యర్థి కళా వెంకట్రావు చేతిలో ఓడిపోయారు. అయితే జగన్మోహన్ రెడ్డి విశాఖ స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్సను నిలబెట్టారు. టిడిపి కూటమి ఆ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన ఆయనను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్ష నేతగా కూడా ఎంపిక చేశారు. అయితే శాసనసభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. కానీ శాసనమండలిలో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఉండడంతో.. బొత్స క్యాబినెట్ హోదాతో కొనసాగుతూ వస్తున్నారు.
* కొద్ది రోజుల కిందటే ఆపరేషన్..
ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బొత్స సత్యనారాయణ అనారోగ్యానికి గురయ్యారు. ఆయన గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల కిందటే ఆయనకు ఆపరేషన్( operation) కూడా జరిగినట్లు సమాచారం. అప్పట్లో కొద్ది రోజులపాటు బయటకు కనిపించలేదు. వాస్తవానికి శాసనమండలి పక్ష నేతగా.. ఎన్నిక కాకమునుపు బొత్స అనారోగ్య కారణాల రీత్యా రాజకీయాల నుంచి తప్పుకుంటారని కూడా ప్రచారం జరిగింది. అయితే శాసనమండలిలో విపక్ష నేతగా ఉన్న బొత్స.. పార్టీ వాయిస్ను గట్టిగానే వినిపిస్తున్నారు. ఇటువంటి క్రమంలో ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. బుధవారం ఒకవైపు వర్షం పడుతుండగా.. మరోవైపు తీవ్ర ఉక్క పోత ఉంది. అందుకే బొత్స ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత ఆయన కోలుకున్నట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఆయన బాగానే కోలుకున్నారని.. అటు ఇటు తిరుగుతున్నారంటూ వీడియోలను, ఫోటోలను జత చేసింది. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.
