Homeఎంటర్టైన్మెంట్r narayana murthy second innings : సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆర్ నారాయణ...

r narayana murthy second innings : సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆర్ నారాయణ మూర్తి…ఆ హిట్ సినిమాలో నటిస్తున్నాడా..?

r narayana murthy second innings :  కొంతమంది నటులు హీరోగా చేయడానికి మాత్రమే ఆసక్తి చూపిస్తారు… ఇతరుల డైరెక్షన్లో సినిమా చేయడానికి ఆసక్తి చూపించరు… అలాంటి వాళ్లలో ఆర్.నారాయణ మూర్తి ఒకరు. ఒకప్పుడు హీరోగా సక్సెస్ ఫుల్ సినిమాలను చేసి పీపుల్ స్టార్ గా అవతరించాడు. నక్సల్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలను చేయడంలో ఆయనను మించిన వారు మరెవరు లేరు. ఇక ఇలాంటి క్రమంలోనే ఒకప్పుడు ఆయన నుంచి వచ్చిన వరుస సినిమాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాయి. అలాంటి నారాయణ మూర్తి ఈ మధ్యకాలంలో పెద్దగా సినిమాలను చేయడం లేదు. ఆయన ను చూసిన చాలా మంది తను ఇతర హీరోల సినిమాల్లో నటిస్తే బాగుంటుంది అని అభిప్రాయ పడుతున్నారు. కానీ ఆయన మాత్రం తన ఓన్ డైరెక్షన్ లో తప్ప వేరే వాళ్ళ డైరెక్షన్లో సినిమాలో నటించినని చెబుతున్నాడు. అంటే వేరే వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా యాక్టింగ్ చేయమని చెబుతారు. తనను హైలెట్ చేసుకునే పాత్రలోనే మాత్రమే కనిపించాలని అనుకుంటున్నాడట. దానివల్లే ఎప్పటికప్పుడు స్టార్ డైరెక్టర్స్ తనని వల్ల సినిమాలో నటించమని అడిగిన తను నో చెబుతున్నాడు.

ఉదాహరణకి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘టెంపర్’ సినిమాలో సైతం పోసాని కృష్ణ మురళి చేసిన పాత్ర కోసం మొదట ఆర్ నారాయణ మూర్తిని అనుకున్నారట. కానీ నారాయణ మూర్తి మాత్రం నేను చేయనంటే చేయనని తేల్చి చెప్పడంతో ఆ పాత్రలోకి పోసాని కృష్ణ మురళిని తీసుకున్నట్టుగా పూరి జగన్నాధ్ గతంలో క్లారిటి ఇచ్చాడు…

కానీ అలాంటి ఆర్ నారాయణ మూర్తి ఇప్పుడు వేరే వాళ్ళ దర్శకత్వం నటిస్తున్నాడు అంటు కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ‘హుషారు’ సినిమాసక్సెస్ ఫుల్ గా నిలిచిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వల్ గా ‘హుషారు 2’ అనే సినిమా వస్తుంది. ఈ సినిమాలో ఆర్ నారాయణ మూర్తి నక్సల్స్ బ్యాక్ డ్రాప్ లో ఉండే కీలకమైన పాత్రల్లో నటిస్తున్నాడంటూ కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు…

నిజంగా నటిస్తున్నారా లేదంటే కావాలనే ఇలా ప్రమోట్ చేస్తున్నారనే విషయం తెలీదు. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఆర్ నారాయణ మూర్తి మంచి డిసిజన్ తీసుకున్నాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక విషయం మీద సినిమా యూనిట్ గానీ నారాయణ మూర్తి కానీ ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే తప్ప ఈ విషయం మీద సరైన క్లారిటి వచ్చే అవకాశాలు లేవు…

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version