MG Motors : కొత్త కారు కొనుగోలు చేసే ముందు చాలామంది వినియోగాలు తమ అభిప్రాయాలను కలిగి ఉంటారు. వీరిలో కొందరు మైలేజ్ ఎక్కువగా ఇస్తుందా? అని చూస్తారు. మరికొందరు కారు ధర ఎంత? అనేది ఎంక్వయిరీ చేస్తారు. ఇంకొందరు మాత్రం కారు ధర, మైలేజ్ తో పని లేకుండా డిజైన్ బాగుంటే చాలు అనుకునే వారు ఉంటారు. ఎందుకంటే అందమైన కారులో ప్రయాణించడం అనేది ఒక అనుభూతిగా భావిస్తారు. ఇలాంటి వారి కోసం కొన్ని కంపెనీలు కారు డిజైన్ పైనే ప్రత్యేకంగా ఫోకస్ పెడుతూ ఉంటాయి. ఇలా ఆకట్టుకునే డిజైన్ కార్లు MG MOTORS కంపెనీ నుంచి ఎక్కువగా బయటికి వస్తుంటాయి. తాజాగా ఓ కారు డిజైన్ ను చూసి వినియోగదారులు షాక్ అవుతున్నారు. ఇంత మంచి కారు సొంతం చేసుకోకుంటే ఎలా? అని చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఆ కారు ఏదంటే?
Also Read : క్రెటా, హారియర్‌లకు గట్టి పోటీ.. ఈ ఎంజీ కారుపై ఏకంగా రూ.4లక్షల తగ్గింపు
ఆటోమొబైల్ మార్కెట్లో మిగతా కంపెనీల కంటే MG MOTORS కంపెనీకి చెందిన కార్లు తక్కువగానే కనిపిస్తాయి. కానీ ఇవి వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఈ కంపెనీకి చెందిన కార్ల డిజైన్ మిగతా కంపెనీల కార్ల కంటే అత్యద్భుతంగా ఉంటాయి. గతంలో వీటి అమ్మకాలు తక్కువగా ఉన్నప్పటికీ.. ఇటీవల వీటి సేల్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. వీటిలో SUV వీరియంట్ కార్లు మరి ఆకట్టుకుంటున్నాయి. 2025 సంవత్సరానికి చెందిన HECTER కారు ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉండడంతో చాలామంది దీనిని కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. అంతేకాకుండా ఇందులో అప్డేట్ ఫీచర్స్ ను అమర్చి అలరిస్తున్నారు.
MG MOTORS HECTOR కారులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ను అమర్చారు. దీనిని E 20 ఫ్యూయల్ కు అనుగుణంగా మార్చారు. 2025 ఏప్రిల్ ఒకటి తర్వాత అన్ని వాహనాలకు ఈ ఫ్యూయల్ సపోర్ట్ తప్పనిసరిగా ఉంటుంది. అలాగే దీనిని మ్యానువల్ ట్రాన్స్మిషన్ తో పాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను కూడా సెట్ చేశారు. దీంతో వినియోగదారులు డ్రైవ్ చేస్తే కొత్త అనుభూతి కలుగుతుంది. కొత్తగా కారు నడిపే వారికి.. స్మూత్ డ్రైవింగ్ చేయాలని అనుకునే వారికి ఈ కారు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అలాగే ఇందులో 142 బిహెచ్పి పవర్ 25 ఎంఎం టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇక ఇందులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ తో పాటు 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్ కారు కూడా అందుబాటులో ఉంది. ఈ రెండు ఇంజాలలో 6 స్పీడ్ మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది.
ఈ కారు మార్కెట్లో ప్రస్తుతం రూమ్ 13.99 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. SUV కారు కావాలని అనుకునే వారికి ఇది మంచి ఫీచర్ను అంచడంతోపాటు ఆకర్షణీయమైన డిజైన్లు కలిగి ఉంది. ఎంజి హెక్టార్ కారు గతంలో మార్కెట్లో ఉన్నప్పటికీ ప్రస్తుతం లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్న ఫీచర్స్తో అందుబాటులో ఉండడంతో చాలామంది దీనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
Also Read : ఎలక్ట్రిక్ కారు సునామీ.. 6 నెలల్లో 20వేల కార్ల విక్రయం