https://oktelugu.com/

Borugadda Anil Kumar: అప్రూవర్ గా బోరుగడ్డ.. ఆ ఇద్దరు వైసీపీ నేతల చుట్టూ ఉచ్చు!

వైసిపి హయాంలో విచ్చలవిడిగా రెచ్చిపోయారు చాలామంది. అటువంటి వారిలో బోరుగడ్డ అనిల్ కుమార్ ఒకరు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చుక్కలు చూస్తున్నారు. పోలీసుల షాక్ ట్రీట్మెంట్ తో అప్రూవర్ గా మారేందుకు సిద్ధపడినట్లు సమాచారం.

Written By:
  • Dharma
  • , Updated On : December 11, 2024 / 11:28 AM IST

    Borugadda Anil Kumar(1)

    Follow us on

    Borugadda Anil Kumar: బోరుగడ్డ అనిల్ కుమార్ అప్రూవర్ గా మారుతున్నారా? అదే సేఫ్ అని భావిస్తున్నారా? లేకుంటే ఇబ్బందులు తప్పవని అనుకుంటున్నారా? వైసీపీ నుంచి ఆయనకు సహాయ నిరాకరణ ఎదురవుతోందా? అందుకే ఈ నిర్ణయానికి వచ్చారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత ఐదేళ్ల వైసిపి హయాంలో బోరుగడ్డ అనిల్ కుమార్ విపరీతంగా చెలరేగిపోయారు. చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా అందరిపై విరుచుకుపడేవారు. అసభ్య పదజాలాలతో దూషించేవారు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ లను లక్ష్యంగా చేసుకొని ఎంతకైనా తెగించి మాట్లాడేవారు. ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగులు కూడా దారుణంగా ఉండేవి. అదే సమయంలో గత ఐదేళ్లలో ఆయన చేసిన అక్రమాలు కూడా ఎక్కువేనని తెలుస్తోంది. కూటమి అధికారంలోకి రావడంతో అవి ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఓ చర్చి ఫాస్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతలో రాష్ట్రవ్యాప్తంగా ఆయనపై ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ఇంకో వైపు చూస్తుంటే వైసీపీ నుంచి ఎటువంటి సాయం అందడం లేదు. విచారణలో షాక్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు పోలీసులు. దీంతో ఒక్కో నిజాలు బయటకు వస్తున్నాయి. అయితే అప్రూవర్ గా మారి సహకరిస్తే తాను బయటపడగలనని.. లేకుంటే ఇబ్బందికర పరిస్థితులు తప్పవని అనిల్ కుమార్ కు తెలుసు. అందుకే ఆయన ఆ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

    * వైసీపీ నుంచి సహాయ నిరాకరణ
    బోరుగడ్డ అనిల్ కుమార్ పై రౌడీషీట్ కూడా ఉంది. న్యాయవాది అని కూడా చెప్పుకుంటారు. అయితే ఓ సాధారణ వ్యక్తి చంద్రబాబుతో పాటు పవన్ పై వ్యక్తిగత విమర్శలకు దిగడం అంత ఈజీ కాదు. ఆయన వెనుక పెద్దలు ఉన్నారు అన్నది ఒక అనుమానం. అనిల్ వ్యవహార శైలిపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫిర్యాదులు కొనసాగుతున్నాయి. అయితే ఇదే పరిస్థితి కొనసాగితే తనకు జైలు జీవితమే గతి అవుతుందని బోరుగడ్డ భయపడుతున్నారట. ఇంత జరుగుతున్నా వైసిపి నుంచి న్యాయ సహాయం సైతం అందడం లేదు. దీంతో ఆయన దిక్కుతోచని స్థితికి చేరుకున్నారు. తన చుట్టూ ఉచ్చు బిగుస్తోందని.. దాని నుంచి తప్పించుకోవాలంటే అప్రూవర్ గా మారడమే మంచిదని ఆయన ఒక ఆలోచనకు వచ్చినట్లు సమాచారం.

    * ఆ ఇద్దరు వైసీపీ నేతల పేర్లు
    బోరుగడ్డ అనిల్ కుమార్ ఇద్దరు వ్యక్తుల పేర్లు వెల్లడించినట్లు ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో భాను పెట్టి అనుచిత పోస్టుల వెనుక ఆ ఇద్దరు వ్యక్తులు ఉన్నారని విచారణలో పేర్కొన్నట్లు సమాచారం. ఆ ఇద్దరూ తాడేపల్లి కేంద్రంగానే రాజకీయాలు చేస్తారని.. బయటకు రారని బోరుగడ్డ పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో బోరుగడ్డను మరింత లోతుగా విచారించే పనిలో పడ్డారు పోలీసులు. పనిలో పనిగా బోరుగడ్డను అప్రూవర్ గా మార్చి.. వైసీపీ కీలక నేతల చుట్టూ మరింత ఉచ్చు బిగించడమే లక్ష్యంగా పోలీసులు ముందుకు సాగుతున్నట్లు సమాచారం.