Mohan Babu : గత రెండు మూడు రోజుల నుంచి మోహన్ బాబు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవల గురించి వార్తలైతే వైరల్ అవుతున్నాయి. ఇక వాళ్ళు చేస్తున్న ప్రతి ఆక్టివిటీ కూడా తమ అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా కొంతవరకు ఇబ్బందికి గురి చేస్తున్నాయనే చెప్పాలి. స్క్రీన్ మీద హీరోలుగా కనిపించే వీళ్లు రోడ్డు మీదకి వచ్చి కొట్టుకోవడం లాంటివి చేయడంతో తెలుగు సినిమా అభిమానులందరు వీళ్ళ మీద కొంతవరకు వ్యతిరేకతనైతే చూపిస్తున్నారు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రమశిక్షణకు పెట్టింది పేరుగా గుర్తింపును సంపాదించుకున్న మోహన్ బాబు తన కొడుకుల విషయంలో మాత్రం తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాడు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాసరి నారాయణరావు గారికి మంచి గుర్తింపు అయితే ఉంది. దర్శక రత్న గా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆయన ఒకప్పుడు స్టార్ హీరోలందరితో సినిమాలను చేసి వాళ్ళందరికీ ది బెస్ట్ సినిమాలను అందించాడు. ఇక తన కెరియర్ లో 150 సినిమాలకు డైరెక్షన్ చేసిన దర్శకుడిగా గిన్నిస్ బుక్ రికార్డు ల్లో కూడా ఆయన పేరు ఎక్కించుకున్నారు. ఇక మొత్తానికైతే దాసరి గారికి అత్యంత ఆప్తుడు మోహన్ బాబు అంటూ అందరూ అభివర్ణిస్తారు…ఇక మోహన్ బాబు ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా దాసరి గారే కావడం విశేషం…అందుకే మోహన్ బాబు ఆ కృతజ్ఞత భావంతో దాసరిగారి దగ్గర ఉండిపోయాడు. దాంతో వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ అయితే ఉండేది ఇక ప్రస్తుతం మోహన్ బాబు తన కొడుకుల విషయంలో కొంతవరకు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆస్తుల విషయంలో కొన్ని తగాదాలు కూడా జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక వీళ్లకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని దాసరి గారు ముందే ఊహించి మోహన్ బాబుతో చెప్పారట.
కానీ మోహన్ బాబు మాత్రం అవేమీ పట్టించుకోకపోవడంతో ఆ గొడవలు ఇక్కడ దాకా వచ్చాయని కొంతమంది మోహన్ బాబు సన్నిహితులు సైతం ఈ విషయాలను తెలియజేస్తూ ఉండడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ఉద్దేశంతో సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న విష్ణు సైతం ఆస్తుల విషయంలో కొంతవరకు తగాదాలు పడుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఏది ఏమైనా కూడా దాసరి గారు చెప్పినట్టు వింటుంటే మోహన్ బాబుకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి ఈరోజు మోహన్ బాబు, విష్ణు, మనోజులను రాచకొండ సీపీ తనను కలవాలని ఆదేశించారు. మరి వాళ్ళని కలిసిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది తెలియాల్సి ఉంది.
ఇక ఏది ఏమైనా కూడా మోహన్ బాబు ఫ్యామిలీ లో ఇలాంటి పరిణామాలు జరగడం అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక నిన్న జరిగిన ఇన్సిడెంట్ లో మోహన్ బాబు తీవ్రమైన అస్వస్థతకు గురవ్వడంతో ఆయన ప్రస్తుతం గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు…