Mohan Babu : ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అయితే మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి కూడా ముగ్గురు హీరోలు వచ్చినప్పటికి వాళ్లలో మోహన్ బాబుని మినహాయిస్తే తన కొడుకులు ఎవరు పెద్దగా సక్సెస్ లు సాధించకపోవడంతో ప్రస్తుతం వాళ్ళు ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ దశకు దగ్గరలో ఉన్నారనే చెప్పాలి…
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల జనాలందరూ మోహన్ బాబు ఫ్యామిలీ లో జరుగుతున్న గొడవల గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ పరువు తీస్తున్నారంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ల మీద కొన్ని విమర్శలైతే చేస్తున్నారు. మోహన్ బాబు ఫ్యామిలీ లో ఉన్న ముగ్గురు కూడా ఎవరి దారిలో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఈ గొడవలకు కారణం మోహన్ బాబు అంటూ ఆయన సన్నిహితులు సైతం తెలియజేస్తున్నారు. ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా ముగ్గురు మూడు దారులను ఎంచుకొని పోవడం వల్లే ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి అంటూ కొంతమంది విమర్శిస్తున్నారు. ఇక ఇప్పుడు వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి కాంప్రమైజ్ చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఎవరు అంటూ చాలా రకాలుగా చర్చలైతే జరుగుతున్నాయి. ఇక రీసెంట్ గా మోహన్ బాబు ప్రముఖ టీవీ ఛానల్ రిపోర్టర్ మీద దాడి చేసిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మోహన్ బాబు తమిళ్ సూపర్ స్టార్ అయిన రజనీకాంత్ మంచి స్నేహితులు రజనీకాంత్ చెబితే మోహన్ బాబు వింటాడు అనే ధోరణిలో కుటుంబ సభ్యులు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి రజనీకాంత్ ను పిలిపించి అతని చేత ముగ్గురికి కౌన్సిలింగ్ ఇప్పించి కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది.
ఇక ఏది ఏమైనా కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ మోహన్ బాబు ఇండస్ట్రీ కి వచ్చినప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ కాబట్టి మోహన్ బాబు కోసం రజనీకాంత్ తరలివచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఏది ఏమైనా కూడా మోహన్ బాబు ఈ ఏజ్ లో ఇలాంటి గొడవలు చేయడం కొడుకులను ఇబ్బంది పెట్టడం లాంటివి ఆయనకు ఉన్న ఇమేజ్ మొత్తాన్ని డ్యామేజ్ అయితే చేసుకుంటున్నాడు.
ఇక ప్రస్తుతానికి సినిమాలేమి లేకుండా ఖాళీగా ఉంటున్న మోహన్ బాబు తన కొడుకులతో గొడవల మీద మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. మరి ఈ విషయంలో ఎవరు కాంప్రమైజ్ అవుతారు వీళ్లను ఎవరు కాంప్రమైజ్ చేస్తారనే విషయాల పట్ల సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది…
ఇక ప్రస్తుతం రజనీకాంత్ ఒక్కడే వీళ్లకు బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తున్నాడు. ఇక వీళ్ళ ముగ్గురికి ఆయన అంటే గౌరవం ఉంది. కాబట్టి ఆయన చెబితే వింటారు అనే ధోరణిలో కుటుంబ సభ్యులు రజనీకాంత్ తో వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నారట. మరి ఆయన ఈరోజు కానీ రేపు గాని వీళ్లను కలిసే అవకాశాలు ఉన్నాయంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి…