https://oktelugu.com/

AP Pensions: ఏపీలో పెన్షన్ల పై బిగ్ అప్డేట్.. వారికి కోత.. మార్గదర్శకాలు జారీ

ఏపీలో పెన్షన్ల పై బిగ్ అప్డేట్ వచ్చింది. కొత్త పింఛన్ల జారీ ఎప్పుడో స్పష్టం అయ్యింది. కొత్తగా పింఛన్లు ఇచ్చే ముందు.. బోగస్ పింఛన్ల ఏరివేత పై దృష్టి పెట్టింది కూటమి సర్కార్.

Written By:
  • Dharma
  • , Updated On : December 9, 2024 / 10:43 AM IST

    AP Pensions

    Follow us on

    AP Pensions: కూటమి సర్కార్ దూకుడుగా ముందుకు సాగుతోంది. కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా పెన్షన్స్ స్కీం పై కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పింఛన్ల కోసం పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు రాష్ట్రవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. అయితే వీరికి కొత్తవి మంజూరు కంటే ప్రస్తుత పెన్షన్ పథకంలో బోగస్ లబ్ధిదారులను గుర్తించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఇందుకోసం పైలెట్ ప్రాజెక్టు సర్వే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. అందులో భాగంగా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. రెండు రోజుల పాటు పెన్షన్ల తనిఖీ చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం జిల్లాకు ఒక సచివాలయాన్ని ఎంపిక చేసి పైలెట్ ప్రాజెక్టుగా సర్వే చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారుల విషయంలో ఈ సర్వే కొనసాగనుంది. గత ఐదేళ్ల వైసిపి పాలనలో పెద్ద ఎత్తున బినామీలకు పింఛన్లు అందించారని ఫిర్యాదులు ఉన్నాయి. తాజాగా కొత్తగా 3 లక్షల మంది వరకు పింఛన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో బోగస్ పింఛన్ల సంగతి తేల్చి కొత్త వాటిని అందించనున్నట్లు తెలుస్తోంది.

    * 3 లక్షల దరఖాస్తులు పెండింగ్
    ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. 3 లక్షలకు పైగా కొత్త పింఛన్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇదే సమయంలో అర్హత లేకపోయినా పింఛన్లు పొందుతున్న వారిపై ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ సిబ్బంది ద్వారా పింఛన్ల పంపిణీ జరుగుతుంది. ఈ క్రమంలో పలువురు బోగస్ పెన్షన్ తీసుకున్నట్లు గుర్తించారు. అందుకే కొత్త పింఛన్ల మంజూరు ముందు.. బోగస్ పెన్షన్లు తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

    * రెండు రోజులపాటు సర్వే
    రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన సచివాలయాల్లో ఈరోజు,రేపు బోగస్ పెన్షన్లను గుర్తించనున్నారు. ఆయా సచివాలయాల్లో వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15 వేల సచివాలయాల్లో సర్వే చేపట్టనున్నారు. ఈ సర్వేలో 13 ప్రశ్నలను అడగనున్నారు. వీటి ఆధారంగా వారిలో అర్హులు ఎవరు? అర్హత లేకపోయినా పెన్షన్ ఎలా అందుకుంటున్నారనే సమాచారం రాబెట్టనున్నారు. మరోవైపు పింఛన్ల తనిఖీలకు సంబంధించి షెడ్యూల్, విధి విధానాలపై సెర్ఫ్ ఉత్తర్వులు జారీ చేసింది. బోగస్ పింఛన్ల ఏరివేత తరువాతే కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.