https://oktelugu.com/

Pushpa 2 : 4 రోజుల్లో 800 కోట్లు..బాలీవుడ్ లో ఖాన్స్ కి కూడా ‘పుష్ప 2’ వసూళ్లు అసాధ్యమే..తెలుగోడి దెబ్బ..బాలీవుడ్ అబ్బా!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2: ది రూల్' విడుదలై నాలుగు రోజులైంది. ఈ నాలుగు రోజుల్లో ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను చూసి తలపండిన ట్రేడ్ పండితులు సైతం నోరెళ్లబెట్టారు.

Written By:
  • Vicky
  • , Updated On : December 9, 2024 / 10:46 AM IST

    Pushpa 2

    Follow us on

    Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ విడుదలై నాలుగు రోజులైంది. ఈ నాలుగు రోజుల్లో ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను చూసి తలపండిన ట్రేడ్ పండితులు సైతం నోరెళ్లబెట్టారు. ముఖ్యంగా హిందీ వెర్షన్ వసూళ్లను చూసి ఖాన్స్ కి సైతం కుళ్ళు రాక తప్పదు. ఎందుకంటే ఒక్క షారుఖ్ ఖాన్ కి తప్ప ఈమధ్య కాలం లో సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి వారికి ఇలాంటి వసూళ్లు రాలేదు. చివరికి అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, రణవీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, దీపికా పదుకొనే ఇలా బాలీవుడ్ సూపర్ స్టార్స్ అందరూ కలిసి నటించిన రీసెంట్ చిత్రం ‘సింగం రిటర్న్స్’ కి ‘పుష్ప 2’ కి వచ్చిన దాంట్లో పావు శాతం వసూళ్లు కూడా రాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగోడి దెబ్బకి, బాలీవుడ్ అబ్బా అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. నాలుగు రోజుల్లో ఈ సినిమా 800 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని రాబట్టింది ట్రేడ్ పండితులు చెప్తున్నారు. పూర్తి వివరంగా ఏ భాషలో ఎంత వసూళ్లు వచ్చాయో ఇప్పుడు మనం చూద్దాము.

    తెలుగు వెర్షన్ వసూళ్లను హిందీ వెర్షన్ వసూళ్లు పూర్తిగా డామినేట్ చేసిందని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఉదాహరణకి నిన్న బాలీవుడ్ లో ఈ చిత్రానికి 85 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు, 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఇప్పటి వరకు బాలీవుడ్ లో ఒక్క సినిమాకి కూడా ఈ స్థాయి వసూళ్లు సింగిల్ డే లో రాలేదని అంటున్నారు అక్కడి ట్రేడ్ పండితులు. మొత్తం మీద నాలుగు రోజులకు కలిపి హిందీ వెర్షన్ లో 285 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయట. ఇది కల్కి హిందీ వెర్షన్ క్లోజింగ్ వసూళ్లకంటే చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. గ్రాస్ 350 కోట్ల రూపాయలకు పైగా హిందీ వెర్షన్ లో ఉంటుంది.

    ఇక తెలుగు లో ఈ సినిమాకి నిన్న ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు. తమిళ వెర్షన్ కి 12 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్, మలయాళం వెర్షన్ కి 5 కోట్ల రూపాయిలు, కన్నడ వర్షన్ కి నాలుగు కోట్ల రూపాయిలు, మొత్తం మీద నాల్గవ రోజు ఈ చిత్రానికి 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు, నాలుగు రోజులకు కలిపి 800 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు. అదే విధంగా నెట్ రూపం లో వసూళ్లను లెక్కగడితే, అన్ని వెర్షన్స్ కి కలిపి 530 కోట్ల రూపాయిలు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. ఊపు చూస్తుంటే ఈ సినిమాకి వారం రోజులు గడవకముందే 1000 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వస్తుందని అంటున్నారు.