Homeఆంధ్రప్రదేశ్‌Amaravati: అమరావతికి బిగ్ రిలీఫ్.. ఆ రెండింటికి రూ.6 వేల కోట్లు!

Amaravati: అమరావతికి బిగ్ రిలీఫ్.. ఆ రెండింటికి రూ.6 వేల కోట్లు!

Amaravati: రాజధాని అమరావతి నిర్మాణం పై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. కేంద్ర ప్రభుత్వం సైతం సాయం చేసేందుకు ముందుకు వస్తోంది. ఇప్పటికే రాష్ట్రం నుంచి వెళ్లిన ప్రతి అభ్యర్థనను ఆమోదిస్తోంది కేంద్రం. ఏకంగా బడ్జెట్లో 15 వేల కోట్ల రూపాయల సాయం ప్రకటించింది. ప్రపంచ బ్యాంకు తో పాటు ఏడిపి నుంచి ఈ నగదు అందించేందుకు కేంద్రం సిద్ధపడింది. జనవరి నుంచి నిర్మాణాలు దిశగా ప్రణాళికలు రూపొందిస్తోంది సి ఆర్ డి ఏ. రోడ్డు రవాణా, రైలు మార్గాలకు సంబంధించి కీలక ప్రాజెక్టులను సైతం కేంద్రం అమరావతికి కేటాయించింది. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గించేలా కేంద్రం నుంచి మరో హామీ దక్కింది. ఒక విధంగా ఇది ఏపీకి బిగ్ రిలీఫ్. అమరావతిలో కీలకమైన బైపాస్ ప్రాజెక్టుల భూసేకరణ ఖర్చు భరించేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఏపీ ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు సానుకూలత వ్యక్తం చేసింది కేంద్రం. అమరావతిలో ఔటర్, తూర్పు బైపాస్ రోడ్డు భూ సేకరణ ఖర్చు భరించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అందుకు సానుకూలంగా స్పందించింది కేంద్రం. ఖర్చు పెట్టేందుకు ముందుకు వచ్చింది.

* ఆ రోడ్లు కీలకం
అమరావతి రాజధాని లో అంతర్గత, బహిర్గత రోడ్లు ఉన్నాయి. ముఖ్యంగా 198 కిలోమీటర్ల పొడవైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు,59 కిలోమీటర్ల తూర్పు బైపాస్ రోడ్ల నిర్మాణం కోసం వేల ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. దీనికోసం దాదాపుగా 6000 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అంత మొత్తంలో భరించడం అసాధ్యం. అందుకే ఆ ఖర్చును భరించాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి నితిన్ గట్కరిని కలిసి ఇదే విషయం పై విన్నవించారు.దీనిపై తాజాగా కేంద్ర ప్రభుత్వం స్పందించింది.అయితే ఈ ఒప్పందంలో భాగంగా తమకు స్టేట్ జిఎస్టి మినహాయింపు ఇవ్వాలని కోరింది.అందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. స్టేట్ జీఎస్టీ ని మినహాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

* ఆ ఖర్చు అంతా కేంద్రానిదే
అమరావతి ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లు కీలకం. ఔటర్ బైపాస్ భూసేకరణ కోసం దాదాపు 4 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. తూర్పు బైపాస్ భూ సేకరణకు మరో రెండు వేల కోట్లు అదనంగా ఖర్చు అవుతుందని భావిస్తున్నారు.ఇప్పుడు ఆ ఖర్చును కేంద్రం భరించని ఉండడంతో 6000 కోట్ల రూపాయల మేరా ఏపీకి రిలీజ్ దొరికినట్లు అవుతుంది.అదే సమయంలో ఈ రహదారుల నిర్మాణం మరింత వేగవంతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తా జాగా జీఎస్టీ మినహాయింపు ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావడంతో.. నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version