Guru Nanak Jayanti 2024: సిక్కులు ఎక్కువగా ఆరాధించే గురునానక్ జయంతిని ప్రతీ ఏడాది కార్తీక మాసంలో జరుపుకుంటారు. ఈ ఏడాది నవంబర్ 15న అనగా శుక్రవారం రోజు జరుపుకోనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా రేపు గురునానక్ జయంతి వేడుకలను సిక్కులందరూ కూడా జరుపుకుంటారు. అయితే ఈ గురునానక్ జయంతిని గురు పురబ్ లేదా ప్రకాష్ పర్వ్ అని కూడా అంటుంటారు. ప్రేమ, సేవ, సమానత్వానికి గుర్తుగా ఈ గురు నానక్ జయంతిని జరుపుకుంటారు. 1469లో లాహోర్ అప్పటి నుంచి ఈ గురునానక్ జయంతిని ఘనంగా జరుపుకుంటారు. ఇతని జయంతి రోజు దేశంలో కొన్ని చోట్ల బ్యాంకులకు సెలవులు కూడా ప్రకటించారు. అయితే గురునానక్ భక్తులు గురునానక్ దేవ్ జీ 555వ జయంతిని ఈ ఏడాది జరుపుకుంటారు. అయితే ఈ గురునానక్ జయంతి ప్రతీ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ నెలలో ఎక్కువగా వస్తుంది. ఈ ఏడాది అనగా రేపు ఏ సమయంలో గురునానక్ జయంతిని జరుపుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.
గురునానక్ జయంతి అనేది పూర్తిమ సమయాల్లోనే ఎక్కువగా జరుపుకుంటారు. రేపు ఉదయం 06:19 గంటలకు పూర్ణిమ తిథి ప్రారంభమవుతుంది. తర్వాత రోజ నవంబర్ 16వ తేదీన 02:58 వేకువ జామున ఈ తిథి ముగుస్తుంది. ఈ తిథి సమయంలోనే గురునానక్ జయంతిని జరుపుకోవాలని పండితులు అంటున్నారు. మెహతా కాలు, మాతా త్రిప్తా అనే తల్లిదండ్రులకు 1469లో ఏప్రిల్ 15న ప్రస్తుతం పాకిస్థాన్‌లోని నాంకనా సాహిబ్‌లో గురునానక్ దేవ్ జన్మించారని చెప్పుకుంటారు. సిక్కులు ఈ పండుగను తప్పకుండా జరుపుకుంటారు. గురునానక్ చిన్న వయస్సు నుంచే బలమైన ఆధ్యాత్మిక ఆసక్తితో ఉండేవాడు. ఎలాంటి పక్షవాతం లేకుండా అందరితో సమానంగా ఉండేవారు. మతాలు, మానవత్వాలు అన్ని కూడా ఒకటేనని అతను నమ్ముతాడు. ఈ ఏడాది గురునానక్ 555వ జయంతిని జరుపుకుంటారు. సిక్కు సమాజంలో మొత్తం 10 మంది గురువులు ఉన్నారు. వీరందరిలో మొట్టమొదటి గురువు గురునానక్. కాబట్టి ఇతని జయంతిని అందరూ కూడా చాలా ఘనంగా జరుపుకుంటారు. గురునానక్ జయంతికి రెండు రోజుల ముందు నుంచి అఖండ మార్గమనే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు. దీని ద్వారా అందరూ కూడా సమానత్వం, సోదరభావంతో ఉండాలని తెలుపుతారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో దీపాలు కూడా వెలిగిస్తారు.
గురునానక్ జయంతిని పురస్కరించుకుని పంజాబ్‌లోని గురుద్వార్‌లో రెండు రోజుల ముందే వేడుకలను ప్రారంభిస్తారు. దీన్నే అఖండ మార్గం అని అంటారు. గురు నానక్ జయంతిని జరుపుకోవడానికి మరోక కారణం కూడా ఉంది. ఇతను హిందూ, ఇస్లాం మతాల గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. అతనికి ఉన్న జ్ఞానంతో 15వ శతాబ్దంలో సిక్కు మతాన్ని స్థాపించాడు. గురునానక్ దేవ్ బోధనల్లో ఎలాంటి స్వార్థం ఉండదు. తన బోధనల ద్వారా అందరికి మంచి చేకూరాలని అనుకుంటారు. ప్రపంచంలోని మనుషులు ఎలాంటి బేధాలు లేకుండా అందరితో కూడా సమానంగా ఉండాలని భావిస్తారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలని, సమానత్వంతో ఎలాంటి కల్మషం లేకుండా ఉండాలనే ఉద్దేశంతోనే అతని బోధనలు ఉంటాయి. వీటిన్నింటి కోసం ఈ గురునానక్ జయంతిని జరుపుకుంటారు.