Incharge Ministers to Districts : 26 జిల్లాలకు ఇన్చార్జి మంత్రుల భర్తీ.. పవన్, లోకేష్ లకు నో ఛాన్స్!

సాధారణంగా కొత్త ప్రభుత్వం కొలువు దీరిన వెంటనే జిల్లాలకు ఇన్చార్జ్ మంత్రులను నియమించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతోంది. ఇన్చార్జ్ మంత్రుల ప్రకటన విషయంలో జాప్యం జరిగింది. దానికి తెర దించుతూ ఈరోజు ఇన్చార్జి మంత్రులను ప్రకటించారు సీఎం చంద్రబాబు.

Written By: Dharma, Updated On : October 15, 2024 3:33 pm

Incharge Ministers to Districts

Follow us on

Incharge Ministers to Districts : ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు దాటుతోంది.కీలక నిర్ణయాలు తీసుకుంటూ సాగుతోంది చంద్రబాబు సర్కార్. అందులో భాగంగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు ఇన్చార్జ్ మంత్రులను నియమించింది. 26 జిల్లాలకు మంత్రులకు బాధ్యతలు అప్పగించింది. అయితే ఓ నలుగురికి మాత్రం రెండు జిల్లాలు చొప్పున కేటాయించడం విశేషం. ఇన్చార్జి మంత్రుల జాబితాలో డిప్యూటీ సీఎం పవన్ తో పాటు లోకేష్ కు మినహాయింపు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. వారిద్దరికీ ఏ జిల్లాలు కూడా కేటాయించలేదు. ఇంచార్జ్ మంత్రులుగా నియమించలేదు. ప్రస్తుతం చంద్రబాబు క్యాబినెట్ లో 24 మంది మంత్రులు ఉన్నారు. ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది. దీంతో 23 మంది మంత్రులకు 26 జిల్లాల ఇన్చార్జిలుగా నియమించారు. మంత్రి కింజరాపు అచ్చం నాయుడుకు మన్యం జిల్లా ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చారు. దీంతోపాటు అంబేద్కర్ కోనసీమ బాధ్యతలు కూడా అప్పగించారు. అలాగే నిమ్మల రామానాయుడు కి తూర్పుగోదావరి, కర్నూలు జిల్లా బాధ్యతలు ఇచ్చారు. గొట్టిపాటి రవికి పలనాడు తో పాటు పశ్చిమగోదావరి జిల్లాల బాధ్యతలు అప్పగించారు. అనగాని సత్యప్రసాద్ కు సత్యసాయి, తిరుపతి జిల్లాల బాధ్యతలు అప్పగించారు.

* ఇన్చార్జ్ మంత్రులు వీరే
శ్రీకాకుళం జిల్లా ఇన్చార్జి మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్, విశాఖ జిల్లాకు బాల వీరాంజనేయ స్వామి, అల్లూరి జిల్లాకు గుమ్మిడి సంధ్యారాణి, అనకాపల్లి జిల్లాకు కొల్లు రవీంద్ర, కాకినాడ జిల్లాకు మంత్రి నారాయణ, ఎన్టీఆర్ జిల్లాకు సత్య కుమార్ యాదవ్, కృష్ణాజిల్లాకు వాసంశెట్టి సుభాష్ఇంచార్జ్ మంత్రులుగా నియమితులయ్యారు. గుంటూరుజిల్లాకు కందుల దుర్గేష్,బాపట్ల జిల్లాకు పార్థసారథి,ప్రకాశం జిల్లాకు ఆనం రామనారాయణరెడ్డి,నెల్లూరు జిల్లాకు ఫరూక్,నంద్యాల జిల్లాకు పయ్యావుల కేశవ్ ను నియమించారు. అనంతపురం జిల్లాకు టీజీ భరత్, కడప జిల్లాకు సవిత, అన్నమయ్య జిల్లాకు బీసీ జనార్దన్ రెడ్డి, ఏలూరు జిల్లాకు నాదెండ్ల మనోహర్, చిత్తూరు జిల్లాకు రాంప్రసాద్ రెడ్డిని ఇంచార్జ్ మంత్రిగా నియమించారు. వారు త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.

* వారిద్దరికీ మినహాయింపు
అయితే డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ లను ఇంచార్జ్ మంత్రుల విషయంలో మినహాయింపు ఇచ్చారు. పవన్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. చంద్రబాబు తర్వాత అంతటి ప్రాధాన్యత దక్కుతూ వస్తోంది. మరోవైపు మంత్రి లోకేష్ విషయంలో సైతం ఈసారి మినహాయింపు ఇవ్వడం విశేషం. వాస్తవానికి లోకేష్ ను విశాఖ ఇన్చార్జ్ మంత్రిగా ప్రకటిస్తారని అంతా ప్రచారం జరిగింది. విశాఖ జిల్లాకు సంబంధించి మంత్రివర్గంలో చోటు దక్కలేదు. దీంతో లోకేష్ కు అక్కడ బాధ్యతలు అప్పగించడం ద్వారా మంత్రి లేని లోటును తీర్చుతారని భావించారు. కానీ పవన్ తో పాటు లోకేష్ ను సైతం ఇన్చార్జి మంత్రిపదవి విషయంలో మినహాయింపు ఇవ్వడం విశేషం.