AP Super Six Implementation: కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. గత ఏడాది మేలో ఎన్నికలు జరగగా.. జూన్ 4న ఫలితాలు వచ్చాయి. టిడిపి కూటమి ఘనవిజయం సాధించింది. 12న ప్రభుత్వం కొలువుదీరింది. అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ పథకాలపై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. వైసిపి హయాంలో నవరత్నాల హామీలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. కానీ సంక్షేమం పేరిట అభివృద్ధిని విస్మరించారు. కానీ చంద్రబాబు అలా కాదు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం అభివృద్ధిపై దృష్టి పెట్టారు. నిధులను సమీకరించగలిగారు. అమరావతి రాజధానిని ప్రారంభించగలిగారు. అదే సమయంలో సూపర్ సిక్స్ హామీల అమలుపై కూడా దృష్టి సారించారు. చాలావరకు అమలు చేయగలిగారు.
పింఛన్ పెంపు సక్సెస్
తాను అధికారంలోకి వస్తే పింఛన్( pension) మొత్తాన్ని మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచుతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. గత ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించి పెంచిన మొత్తాన్ని జూలై తో కలిపి అందిస్తానని చెప్పుకొచ్చారు చంద్రబాబు. మూడు వేల రూపాయల మొత్తంతో కలిపి ఒకే నెల 7వేల రూపాయల నగదును ప్రతి లబ్ధిదారుడుకు అందించారు. అయితే పింఛన్ల పంపిణీలో రికార్డు సృష్టించారు చంద్రబాబు. వైసిపి హయాంలో ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ను నియమించిన సంగతి తెలిసిందే. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను నిలిపివేశారు. దీంతో పింఛన్ల పంపిణీ ఎలా చేస్తారో చూస్తాం అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎద్దేవా చేశారు. కానీ సచివాలయ సిబ్బందితోపాటు ప్రభుత్వ ఉద్యోగులతో గత ఏడాది కాలంగా పింఛన్లు అందించగలిగారు. ఒక విధంగా చెప్పాలంటే పింఛన్ లబ్ధిదారుల్లో కూటమి ప్రభుత్వం పట్ల సానుకూలత, సంతృప్తి కనిపిస్తోంది.
Also Read: Viral Video : చంద్రబాబుకు నిరసన సెగ.. అప్పుడే మొదలైందిగా.. నిలదీసిన యువకుడి వీడియో వైరల్
ఉచిత గ్యాస్ అమలు..
మరోవైపు టిడిపి దీపం 2.0( Deepam 2.0) పథకం ద్వారా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తోంది. ఈ పథకం సూపర్ సిక్స్ లో ఒకటి. గత ఏడాది దీపావళి నాడు ఈ పథకాన్ని ప్రారంభించింది కూటమి సర్కార్. దీనికోసం ఏడాదికి రూ.2601 కోట్లు ఖర్చు చేసింది. 90 లక్షల కుటుంబాలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల చొప్పున అందిస్తోంది. సగటు సామాన్య మధ్యతరగతి కుటుంబ జీవన ప్రమాణం పెంచే విధంగా ఈ పథకాన్ని అమలు చేయడం విశేషం. అయితే ఈ పథకం పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విషప్రచారం చేస్తుండడంతో.. లబ్ధిదారులకు ముందుగానే నగదు జమ చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.
Also Read: Free Bus Scheme : మహిళలకు షాక్.. ఏపీలో ఆ పథకం ఇప్పట్లో లేనట్టే!
ప్రజల నుంచి సానుకూలత..
సూపర్ సిక్స్ పథకంలో అత్యంత కీలకమైన తల్లికి వందనం( Thalliki Vandanam) పథకం అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం అన్ని రకాల కసరత్తు పూర్తి చేసింది. రేపు విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయనుంది. దాదాపు 67 లక్షల మంది తల్లుల ఖాతాల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు జమ చేసేందుకు సిద్ధపడింది. వైసిపి మాదిరిగా ఎటువంటి కోత లేకుండా.. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అందించేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు అన్నదాత సుఖీభవ పథకాన్ని సైతం అమలు చేసేందుకు నిర్ణయించింది. ఇదే నెలలో కేంద్రం పిఎం కిసాన్ పేరిట రైతులకు సాయం అందించనుంది. ఆ పథకం తోనే అన్నదాత సుఖీభవ మొత్తాన్ని అందించేందుకు నిర్ణయించింది. ఇంకోవైపు ఆగస్టు 15 నుంచి సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం ప్రారంభించింది. ఈ లెక్కన సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అతి ప్రధానమైన నాలుగు పథకాలకు శ్రీకారం చుట్టినట్టే. వాస్తవానికి కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను అధిగమించడానికి ఆరు నెలల సమయం పట్టింది. ఇప్పుడిప్పుడే పాలన గాడిలో పడుతోంది. సూపర్ సిక్స్ పథకాలు కచ్చితంగా అమలు చేస్తారన్న నమ్మకం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విష ప్రచారాన్ని ప్రజలు నమ్మే స్థితిలో మాత్రం లేరు.