Nithin Thammudu Trailer Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో నితిన్ (Nithin) ఒకరు… ఈయన చాలా సినిమాలు చేస్తున్నప్పటికి వచ్చిన సినిమాలు వచ్చినట్టుగా ఫ్లాప్ అవుతున్నాయి తప్ప భారీ సక్సెస్ లను మాత్రం సాధించలేకపోతున్నాయి. గతంలో 13 ఫ్లాప్ సినిమాల తర్వాత ఇష్క్ (Ishq) సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించడానికి అప్పటినుంచి ఇప్పటివరకు వరుస సక్సెస్ లను సాధించాలనే ఉద్దేశ్యంతో మంచి సినిమాలను చేసినప్పటికి అవి ఆశించిన మేరకు విజయాలను సాధించలేకపోతున్నాయి. ఇక ఈ సంవత్సరంలో ఇప్పటికే రాబిన్ హుడ్ సినిమాతో భారీ ఫ్లాప్ ని మూటగట్టుకున్న ఆయన వేణు శ్రీరామ్ (Venu Sriram) దర్శకత్వంలో తమ్ముడు (Thammudu) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ గత కొద్దిసేపటి క్రితమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ట్రైలర్ ను కనక మనం అబ్జర్వ్ చేస్తే ఇందులో ఒక ఊరి కోసం నితిన్ పోరాటం చేసే వ్యక్తిగా కనిపించబోతున్నాడు. ముఖ్యంగా తన అక్క అయిన లయకి ఇచ్చిన మాట కోసం ఆ ఊరి ప్రజల్ని వాళ్ళ అక్క కూతురు అయిన పాపని కాపాడడానికి కొంతమంది దుర్మార్గులతో పోటీ పడి వాళ్లను ఓడించే ప్రయత్నం అయితే చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక నితిన్ యాక్షన్ సన్నివేశాల్లో చాలా అద్భుతంగా కనిపించాడు.
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వేణు శ్రీరామ్ మేకింగ్ ఈ సినిమాకి చాలా ప్లస్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే గుహన్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఆయన అందించిన విజువల్స్ ట్రైలర్ కి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి… ఇక అంజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ కూడా ట్రైలర్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. ముఖ్యంగా ట్రైబల్ ఏరియాలో జరిగే ఒక ప్రాబ్లం కి సొల్యూషన్ ని కనిపెట్టడమే హీరో గోల్ గా తెలుస్తోంది. ఇక మొదటి నుంచి కూడా హీరో ఆర్చరీ ప్లేయర్ గా కనిపిస్తాడు.
ఫైనల్ గా విలన్స్ ను ఎదిరించడానికి ఆయన బాణం తో ఫైట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఈ ట్రైలర్ లో నితిన్ చెప్పిన డైలాగ్ ‘మాట పోయి మనిషి బతికినా మనిషి పోయినట్టే లెక్క…అదే మాట బతికి మనిషి పోతే మనిషి బతికి ఉన్నట్టే లెక్కా’…అంటూ ఆయన చెప్పిన డైలాగ్స్ ఈ ట్రైలర్ కి హైలెట్ గా నిలిచింది…ఇక ఇందులో మైనస్ ల గురించి మాట్లాడుకుంటే ఇది రొటీన్ కథలా అనిపిస్తుంది…ఆ బ్యాక్ డ్రాప్ కూడా ఇంతకు ముందు సినిమాల్లో చూసినట్టుగా అనిపిస్తుంది…బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ తో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి…మరి వాటన్నింటిని కాదని దర్శకుడు ఈ మూవీలో ఏం చూపిస్తాడు అనేది చూడాలి…