Viral Video : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతోంది. ఇప్పుడిప్పుడే సంక్షేమ పథకాలపై ఒక స్పష్టత వస్తోంది. అయితే 8 నెలలు అవుతున్నా.. ఇంతవరకు ప్రధాన సంక్షేమ పథకాలకు సంబంధించి అడుగు ముందుకు కూడా పడలేదు. దీంతో కూటమి ప్రభుత్వంపై ఇప్పుడిప్పుడే చిన్నపాటి అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఆపై విపక్షాలు సైతం సంక్షేమ పథకాలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. తాను అధికారంలోకి వస్తే రెట్టింపు సంక్షేమాన్ని అమలు చేస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం సంక్షేమ పథకాలు అమలు చేసి తీరుతామని ఆర్భాటం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక రకరకాల కారణాలు చెబుతూ జాప్యం చేస్తూ వచ్చారు. అయితే దీనిపై ముప్పేట విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చివరకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం ఒత్తిడికి గురవుతున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేసేది ఎప్పుడు అని ప్రశ్నిస్తున్నారు. ఈ తరుణంలో సొంత పార్టీ నుంచి చంద్రబాబుకు ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
* చంద్రబాబు అలెర్ట్
అయితే సంక్షేమ పథకాల విషయంలో విమర్శలు ఎదురు కావడంతో చంద్రబాబు అలర్ట్ అయ్యారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా అన్నదాత సుఖీభవ తో పాటు తల్లికి వందనం పథకంపై దృష్టి పెట్టారు. వీలైనంత త్వరగా అమలు చేయాలని భావిస్తున్నారు. ఇటీవల చంద్రబాబు సంక్షేమ పథకాలపై కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న దృష్ట్యా సంక్షేమ పథకాలు అమలు చేయలేమని ఆయన చేతులెత్తేశారు. దీంతో ఇది విపక్షాలకు ప్రచార అస్త్రంగా మారింది. అసలు ఏపీలో సంక్షేమ పథకాలు అమలయ్యే అవకాశం లేదని ప్రచారం మొదలుపెట్టింది వైసిపి. ఈ తరుణంలో అధికార కూటమిలో ఒక రకమైన ఆందోళన ప్రారంభం అయ్యింది.
* వీడియో వైరల్
అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఏపీ సీఎం చంద్రబాబు ఓ సమావేశంలో ప్రసంగిస్తుండగా టిడిపి శ్రేణులు ఒక ప్రశ్న వేశాయి. అన్నదాత సుఖీభవ ఎప్పుడు విడుదల చేస్తారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించడంతో చంద్రబాబు అలెర్ట్ అయ్యారు. త్వరలోనే అంటూ సంభోదించారు. తమ్ముడు ముందు ఈ రాష్ట్రానికి ఆదాయం సమకూరాలి.. సంపద సృష్టించే మార్గం చెప్పు తమ్ముడు అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఇదే అంశాన్ని పెట్టుకొని వైసీపీ అదే పనిగా ప్రచారం చేయడం ప్రారంభించింది. సంక్షేమ పథకాల అమలు ఇప్పుడు కానట్టు చంద్రబాబు చెబుతున్నట్టు చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. సోషల్ మీడియా అదే పనిగా ప్రచారం చేయడం ప్రారంభించింది.
సూపర్ సిక్స్ అమలు చేయడం చేతగాని @ncbn నువ్వు విజనరీ అని డప్పు కొట్టుకోవడం అవసరమా?#ChandraBabu #SuperSix pic.twitter.com/ruZDOwv5Ra
— YSRCP America (@YSRCPAmerica) February 1, 2025