AP GST Collections: ఏపీలో( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం మరో సరికొత్త రికార్డు సృష్టించింది. జీఎస్టీ వసూళ్లలో గణనీయమైన వృద్ధి సాధించింది. గత ఏడాదితో పోల్చితే రికార్డు స్థాయిలో జీఎస్టీ వృద్ధి నమోదు అయింది. దేశ సగటు వృద్ధి పది శాతం కాగా.. ఏపీలో రెట్టింపు వృద్ధి ఉంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జిఎస్టి వసూళ్లలో వెనుకబడి ఉంది. దీంతో విపక్షం సైతం దీనిని ప్రచారాస్త్రంగా మార్చుకుంది. దానికి కారణం లేకపోలేదు. అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. జీఎస్టీ వసూళ్లలో వెనుకబాటు కనిపించడంతో.. ఇదే నా సంపద సృష్టి అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించడం ప్రారంభించింది. దీనికి సమాధానం కూడా ఇవ్వలేకపోయింది కూటమి. అయితే గత ఏడాదిగా చేసిన ప్రయత్నం గత నెల నుంచి కనిపించింది. జూలై నెలలో జీఎస్టీ వసూళ్లలో పురోగతి ప్రారంభం అయింది. ఆగస్టు నెలకు సంబంధించి ఏకంగా 21% వృద్ధి కనిపించడం విశేషం.
* దేశ వృద్ధి రేటు కంటే..
దేశంలో జీఎస్టీ( GST) వృద్ధి గత ఏడాదితో పోల్చుకుంటే 10% పెరిగింది. కానీ ఏపీకి వచ్చేసరికి 21 శాతానికి పెరగడం మాత్రం గుర్తించాల్సిన అంశం. 2025 ఆగస్టులో రూ.3989 కోట్ల రాబడి వచ్చింది జిఎస్టి ద్వారా. దేశంలో జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఇదే అత్యధిక రాబడి అని అధికారులు చెబుతున్నారు. దేశంలో ఇతర రాష్ట్రాల కంటే చాలా ఎక్కువ. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, అండమాన్ నికోబార్ దీవులను మినహాయిస్తే జీఎస్టీ వసూళ్లలో ఏపీ అగ్రస్థానంలో ఉంది. గత ఏడాది ఆగస్టులో జిఎస్టి వసూలు రూ.3298 కోట్లు రాగా.. ఈ ఏడాది అదే ఆగస్టులో రూ.3989 కోట్లు రావడం విశేషం.
* సీఎం చంద్రబాబు చొరవతో..
2018 నుంచి జిఎస్టి అమల్లోకి వచ్చింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టిస్తామని చంద్రబాబు( CM Chandrababu) ప్రకటనలు చేశారు. క్షేత్రస్థాయిలో జీఎస్టీ వసూలు చూస్తుంటే మాత్రం ఇబ్బందికరంగా ఉన్నాయి. వాస్తవానికి 2023 ఆగస్టు తో పోలిస్తే.. 2024 ఆగస్టులో నికర జీఎస్టీ వసూలు 14.38 శాతానికి పెరిగాయి. స్థూల జీఎస్టీ వసూళ్లు అయితే 14.67% వృద్ధిని నమోదు చేశాయి. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు తప్పలేదు. 2024 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు జీఎస్టీ ద్వారా రూ.21,164 కోట్ల ఆదాయం వచ్చింది.. అదే 2025లో ఇది రూ.22352 కోట్లకు చేరింది. అదే సమయంలో ఇంధన రంగంలో కూడా వృద్ధి పెరిగింది. ఆగస్టు నెలలో జీఎస్టీ వసూళ్ల వివరాలు చెప్పేందుకు ముందుకు వచ్చారు వాణిజ్య పనుల శాఖ చీఫ్ కమిషనర్ బాబు. గత ఏడాదితో పోలిస్తే వసూళ్లు బాగా పెరిగాయని.. పెట్రోల్ అమ్మకాలు పెరగడం వల్ల కూడా ప్రభుత్వానికి ఆదాయం పెరిగిందని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు జీఎస్టీ పెరుగుతూ వచ్చిందని గుర్తు చేశారు. వాస్తవానికి కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జీఎస్టీ వసూళ్లు కొన్ని నెలల పాటు తగ్గాయి. దీనిపై విమర్శలు రావడంతో సీఎం చంద్రబాబు స్పందించారు. వరుసగా సమీక్షలు నిర్వహించారు. అవి ఫలితం ఇవ్వడం ప్రారంభించాయి. జీఎస్టీ లో పెరుగుదల మొదలైంది.