Vijayawada Sakshi: ఏపీలో సాక్షి మీడియాపై ( Sakshi media) ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. విజయవాడలోని ఆటోనగర్ లో ఉన్న సాక్షి మీడియా ప్రధాన కార్యాలయంలో అర్ధరాత్రి పోలీసులు సోదాలు చేశారు. అర్ధరాత్రి 12:30 గంటల నుంచి తెల్లవారుజాము రెండు గంటల వరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. సాక్షి పత్రిక పై తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడంతోనే ఈ సోదాలు నిర్వహించినట్లు సమాచారం. సాక్షి ఎడిటర్ తో పాటు పత్రికలో పనిచేసిన పలువురు జర్నలిస్టులపై కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో స్థానికంగా కొద్దిపాటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాత్రి సమయంలో తనిఖీలు నిర్వహించడంపై జర్నలిస్ట్ సంఘాలు తప్పుపడుతున్నాయి.
* పదోన్నతుల్లో వసూళ్ల పర్వం..
ఇటీవల పోలీస్ శాఖలో( police department) పదోన్నతులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమోషన్స్ కోసం భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు సాక్షిలో ఒక కథనం వచ్చింది. పైసా మే ప్రమోషన్ అనే శీర్షికన పేరుతో ఈ కథనం రాగా.. పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు స్వయంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కథనం ద్వారా రాష్ట్ర డిజిపిని కించపరుస్తూ.. పోలీస్ శాఖ పై అవినీతి మచ్చ మోపి ప్రయత్నం జరిగిందని ఆయన ఆరోపించారు. ఫిర్యాదు అందుకున్న తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
* కొద్ది రోజుల క్రితం..
అయితే అర్ధరాత్రి పోలీస్ తనిఖీలు పై జర్నలిస్టులు( journalist ) అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా సాక్షిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఏకంగా పోలీస్ శాఖపై రావడానికి సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే సాక్షి ఎడిటర్ తో పాటు పనిచేస్తున్న పాత్రికేయ సిబ్బందిపై కూడా కేసులు నమోదు చేసినట్లు సమాచారం. కొద్దిరోజుల కిందట సాక్షి మీడియాలో అమరావతి రాజధానిపై డిబేట్లో తప్పులు దొర్లిన సంగతి తెలిసిందే. అమరావతి ప్రాంతంలో ఆ టైపు మహిళలు ఉన్నారంటూ సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వాటిని నియంత్రించకపోగా యాంకర్ గా ఉన్న సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని.. కొంత సమర్థిస్తూ మాట్లాడారు. దీనిపై అమరావతి మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున ఆందోళనలు జరపడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీనియర్ జర్నలిస్టులు కృష్ణంరాజుతో పాటు కొమ్మినేని శ్రీనివాస్ ల అరెస్టు జరిగింది. చివరకు కొమ్మినేని కి బెయిల్ లభించింది. ఇప్పుడు ఏకంగా పోలీస్ శాఖపై కథనం రావడంతో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ ga తీసుకున్నట్లు తెలుస్తోంది. అరెస్టులు కూడా జరుగుతాయని ప్రచారం సాగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.